Karthika Deepam: దీప కోసం ఇంటి నుంచి బయటకొచ్చిన సుమిత్ర

నేను దీపను ఏ రోజూ కూడా పరాయి దానిలాగా చూడలేదు.

Update: 2025-01-06 09:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

నువ్వు అన్నది నిజమే.. నేను దీపను ఏ  రోజూ కూడా పరాయి దానిలాగా చూడలేదు. నా కన్న కూతురనే భావించాను. అంతే ప్రేమగా చూశాను.. నాకు తన మీద ప్రాణం కాపాడిందన్న కృతజ్ఞతే కాదు.. ఇంకా ఎదో విడదీయరాని బంధం ఎదో ఉన్నట్టు అనిపిస్తుందయ్యా? అంటూ సుమిత్ర కన్నీళ్లు పెట్టుకుంటుంది. ‘అవును మీరు చెప్పింది నిజమే.. ఎదో విడదీయరాని బంధం ఉన్నట్టు ఉంది.. మీ ఇద్దరి మధ్య. అది మీకు త్వరలోనే నీకు తెలుస్తుంది ' అని దాసు అనుకుంటాడు. ‘ఇక్కడ ఉండటం ఇక నా వల్ల కాదయ్యా వెళ్లిపోదాం పదా’ అని సుమిత్ర అంటుంది. అలాగేనమ్మా అంటాడు దాసు.

ఇంతలో సుమిత్ర.. దాసుతో.. ‘నాకు దీప చేతి వంట తినాలని ఉంది.. తిని చాలా రోజులైందయ్యా..’ అని సుమిత్ర అంటుంది. ‘అదెంత భాగ్యమమ్మా నీ కూతురు చేతి వంట మీరు కాకుండా ఎవరు తింటారు? అని దాసు అంటాడు. ఇదేంటి ఇలా అన్నాడు అని సుమిత్ర అయోమయంగా చూస్తూ ఉంటుంది. ‘అదేనమ్మా దీపను పరాయి దానిలా కాకుండా, మీ కూతురులా చూశారు కదా అని .. అందుకే అలా అన్నాను’ అంటాడు. వెంటనే ఆటో డ్రైవర్‌కి డబ్బులు ఇచ్చి.. పార్సిల్ తెప్పించి ఇస్తాడు దాసు. వాటిని సుమిత్రకు ఇచ్చి.. ‘ఇదిగోమ్మా మీ దీప చేతి వంట ' అని అనగానే సుమిత్ర మురిసిపోతుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది. 

Read More...

Brahmamudi : అందరి ముందు కావ్య ని పొగిడిన రాజ్


Tags:    

Similar News