Yash: ‘టాక్సిక్’ మూవీ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుందంటూ ట్వీట్

స్టార్ హీరో యశ్(Yash) కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 సినిమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు.

Update: 2025-01-06 08:45 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో యశ్(Yash) కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 సినిమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రామాయణ(Ramayana), కేజీఎఫ్-3 వంటి భారీ బడ్జెట్ మూవీస్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే యశ్ ‘టాక్సిక్’ (Toxic)సినిమాలో కూడా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. దీనికి గీతూ మోహన్ దాస్(Geethu Mohandas) దర్శకత్వం వహిస్తుండగా.. కేవీఎన్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్(Monster Mind Creations) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘టాక్సిక్’(Toxic) నుంచి బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. జనవరి 8న యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ గ్లింప్స్, పోస్టర్ ఉదయం 10: 25 గంటలకు స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుంది రెడీగా ఉండండి అని వెల్లడించారు. అంతేకాకుండా చీకటిలో కారు పక్కకు ఆపి యశ్ సిగరేట్(Cigarette) తాగుతున్న స్టైలిష్ పోస్టర్‌(Stylish poster)ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది.

Tags:    

Similar News