Ration Rice case: మళ్లీ విచారణకు జయసుధ..!

రేషన్ బియ్యం మాయం కేసులో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2025-01-01 17:13 GMT

దిశ, వెబ్ డెస్క్: రేషన్ బియ్యం మాయం కేసు(Ration rice indigestion case)లో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ(Former minister Perni Nani wife Jayasudha)ను పోలీసులు విచారించారు. మచిలీపట్నం ఆర్.పేట సీఐ ఏసుబాబు(Machilipatnam R. Peta CI Asubabu) రెండు గంటలకుపైగా ఆమెను ప్రశ్నించారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ ఏ1గా ఉన్నారు. జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు పోలీసుల విచారణకు సహకరించాలని జయసుధను ఆదేశించారు. ఈ మేరకు న్యాయవాదులతో కలిసి బుధవారం ఆమె బందరు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. అయితే అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఆమెకు పోలీసులు సూచించారు. విచారణ ముగియడంతో జయసుధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


Similar News