Vijayawada:దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
కొత్త సంవత్సరంలో మొట్టమొదటి సారిగా దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి గారు ఈ రోజు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరంలో మొట్టమొదటి సారిగా దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి గారు ఈ రోజు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ అధికారులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సుతో ఉల్లాసంగా జీవించాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం దేవాలయాల ఆధునీకరణకు మరియు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధి పై చర్చించి, రోజు వారి జరిగే కార్యక్రమాల పై చర్చించారు. భక్తులకు మరింత సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ లో భక్తులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.