శరవేగంగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు

దిశ, అన్నపురెడ్డిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సాగుభూములకు నీరు అందించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన రెవెన్యూ పరిధిలో శ్వేత కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో ప్యాకేజీ 7 కాలువ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ సిబ్బంది బోయినపల్లి సుధాకర్ పర్యవేక్షణలో చైన్ నెంబర్ 75 కిలోమీటర్ల నుంచి భారీ యంత్ర పరికరాలతో ప్రాజెక్టు కాలువ తవ్వకం […]

Update: 2021-12-13 02:55 GMT

దిశ, అన్నపురెడ్డిపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సాగుభూములకు నీరు అందించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన రెవెన్యూ పరిధిలో శ్వేత కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో ప్యాకేజీ 7 కాలువ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ సిబ్బంది బోయినపల్లి సుధాకర్ పర్యవేక్షణలో చైన్ నెంబర్ 75 కిలోమీటర్ల నుంచి భారీ యంత్ర పరికరాలతో ప్రాజెక్టు కాలువ తవ్వకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ వల్ల జాప్యం ఏర్పడిందని మే నాటికి మాకు ఇచ్చిన పరిధిని పనులు పూర్తి చేస్తామని రాత్రింబవళ్ళు పనులు చేస్తున్నామని తెలిపారు. గోదావరి నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పెద్ద ఎత్తున నీరు తోడే అతి పెద్ద ప్రాజెక్టులలో సీతారామ రెండోది కానుంది. ప్రాజెక్టు పూర్తయితే స్థానిక పంట పొలాలు సస్యశ్యామలం కానున్నాయని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News