ఆహారంలో మత్తుమందు కలిపి.. తల్లీకూతుళ్లపై అఘాయిత్యం

దిశ, వెబ్ డెస్క్ : కామాంధులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. తమ కోరికలను తీర్చుకునేందుకు ఎంతటి దుశ్చర్యలకైనా పాల్పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ఎవరినీ వదలడం లేదు. ఒకవేళ అడ్డుకునేందుకు యత్నించే హత్యాచారానికి కూడా వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే తన కొడుకు, కుమార్తెతో కలిసి ఓ ఇంట్లో ఒంటిరిగా ఉంటున్న మహిళపై ఇంటి యాజమాని కన్నేశాడు. ఏలాగైనా ఆమెను లోబర్చుకోవాలని పన్నాగం పన్నాడు. అందులో భాగంగానే వారు తినే ఆహారంలో మత్తు […]

Update: 2020-07-22 05:06 GMT

దిశ, వెబ్ డెస్క్ :
కామాంధులు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. తమ కోరికలను తీర్చుకునేందుకు ఎంతటి దుశ్చర్యలకైనా పాల్పడుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ల వరకు ఎవరినీ వదలడం లేదు. ఒకవేళ అడ్డుకునేందుకు యత్నించే హత్యాచారానికి కూడా వెనుకాడటం లేదు. ఈ క్రమంలోనే తన కొడుకు, కుమార్తెతో కలిసి ఓ ఇంట్లో ఒంటిరిగా ఉంటున్న మహిళపై ఇంటి యాజమాని కన్నేశాడు. ఏలాగైనా ఆమెను లోబర్చుకోవాలని పన్నాగం పన్నాడు. అందులో భాగంగానే వారు తినే ఆహారంలో మత్తు మందు కలిపాడు. వారంతా స్పృహ కోల్పోగానే ఇంటి యాజమాని తన స్నేహితులతో కలిసి తల్లీకూతుళ్ల మీద తన కామ వాంఛ తీర్చుకున్నాడు.

ఈ దారుణ ఘటన హైదరాబాద్ మహానగరంలోని చందానగర్‌లో బుధవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. చందానగర్‌‌కు చెందిన ఓ మహిళ(35) తన కూతురు(15), కొడుకుతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. అందంగా ఉన్న ఆ మహిళ పై ఇంటి యాజమాని కన్ను పడింది. ఏలాగైనా ఆమెను లోబర్చుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ కుటుంబం తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. అది తెలియక వారు మత్తు మందు కలిపిన ఆహారం తినేశారు.

కొద్దిసేపటికే వారంతా స్పృహ కోల్పోగానే ఇంటి యాజమాని, అతడి స్నేహితులు ఆ మహిళతో పాటు, ఆమె కూతురిపై లైంగిక దాడికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మహిళను, ఆమె కూతురిని ఉస్మానియా ఆస్పత్రికి, కొడుకును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. నిందితులను అందుపులోకి.. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News