మామిడిపండ్ల ఆశ చూపి అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మైనర్ బాలికలపై అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. చిన్న పిల్లలనే టార్గెట్ చేసుకుంటున్న కామాంధులు వారికి మాయమాటలు చెప్పి కోరిక తీర్చుకుంటున్నారు. కోర్టులు, పోలీసులు కఠిన చట్టాలు తీసుకొస్తున్న కొంతమంది ప్రబుధ్దులు మాత్రం తమ వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు. అభం శుభం తెలియని బాలికలకు చిన్న వయస్సులో నరకం చూపిస్తున్నారు. మామిడిపండ్లు ఇస్తామంటే వచ్చిన మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన అమానుష ఘటన బీహర్‌లో వెలుగుచూసింది. బీహర్‌లోని చాప్రా ప్రాంతంలో […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మైనర్ బాలికలపై అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. చిన్న పిల్లలనే టార్గెట్ చేసుకుంటున్న కామాంధులు వారికి మాయమాటలు చెప్పి కోరిక తీర్చుకుంటున్నారు. కోర్టులు, పోలీసులు కఠిన చట్టాలు తీసుకొస్తున్న కొంతమంది ప్రబుధ్దులు మాత్రం తమ వక్ర బుద్ధిని మార్చుకోవడం లేదు. అభం శుభం తెలియని బాలికలకు చిన్న వయస్సులో నరకం చూపిస్తున్నారు. మామిడిపండ్లు ఇస్తామంటే వచ్చిన మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన అమానుష ఘటన బీహర్‌లో వెలుగుచూసింది.
బీహర్‌లోని చాప్రా ప్రాంతంలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చాప్రాలోని ఓ స్కూల్ మైదానంలో ఆడుకుంటున్న ఇద్దరు మైనర్ బాలికలను గమనించిన.. యువకులు వారిని అత్యాచారం చేసేందుకు పథకం వేశారు. దీంతో బాలికల వద్దకు వెళ్లి తమకు మామిడితోట ఉందని.. తోటలో నుంచి మామిడి పండ్లు ఇస్తామని ఆశపెట్టారు. వారి కుట్ర తెలియని మైనర్ బాలికలు బండి ఎక్కారు. ఎవరూ లేని అదును చూసుకున్న నిందితులు వైనర్ బాలికలను నేరుగా మామిడితోటకు తీసుకెళ్లారు.
అనంతరం బాలికలను బెదిరించి అత్యాచారం చేశారు. ఆ కామాంధులు నరకం చూపించడంతో మైనర్‌లు ఒక్కసారిగా గట్టిగా అరిచారు. బాలికల ఏడుపు విన్న ఓ రైతు స్థానికులను వెంటబెట్టుకొని ఘటనా స్థలానికి వచ్చాడు. ఆ యువకుల చేసిన పనికి ఆగ్రహంతో చెట్టుకు కట్టేసి మరీ చితకబాదారు. ఇందులో ఓ యువకుడు స్థానికులను గమనించి ముందుగానే పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ బాలికలను ఆస్పత్రికి తరలించారు. పట్టుబడ్డ నిందితుడిని అదుపులోకి తీసుకొని.. పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఇటువంటి దారుణానికి ఒడిగట్టిన వారికి కఠిన శిక్ష వేయాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.