యాచకురాలిపై అత్యాచారయత్నం.. చంపేసి సెప్టిక్ ట్యాంకులో..
దిశ, పర్వతగిరి: యాచకురాలిపై అత్యాచారానికి యత్నించి.. ఆపై హత్య చేసిన ఇద్దరు మృగాళ్లను వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఒగ్గు కొమురయ్య, కొమురమ్మ(50) దంపతులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో కొమురమ్మ గ్రామంలోని ప్రసిద్ధ యాకుబ్ షావలి బాబా దర్గా వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. అదే గ్రామానికి చెందిన పోడేటికృష్ణ, మేకల […]
దిశ, పర్వతగిరి: యాచకురాలిపై అత్యాచారానికి యత్నించి.. ఆపై హత్య చేసిన ఇద్దరు మృగాళ్లను వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామానికి చెందిన ఒగ్గు కొమురయ్య, కొమురమ్మ(50) దంపతులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో కొమురమ్మ గ్రామంలోని ప్రసిద్ధ యాకుబ్ షావలి బాబా దర్గా వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. అదే గ్రామానికి చెందిన పోడేటికృష్ణ, మేకల రాజులు ఇద్దరు స్నేహితులు. ఈనెల 4న కొంతమంది స్నేహితులతో కలిసి రాజు ఇంట్లో పార్టీ చేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మిగతా స్నేహితులు వెళ్లిపోగా.. పోడేటికృష్ణ, మేకల రాజులు ఇద్దరే మిగిలారు. ఆ సమయంలో వారి వద్దకు కొమురమ్మకు భిక్షాటనకు వెళ్లింది.
మద్యం మత్తుల్లో ఉన్న ఇద్దరు కొమురమ్మపై అత్యాచారానికి యత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో పాటు విషయాన్ని తన బంధువులకు చెబుతానని ఇద్దరిని హెచ్చరించింది. దీంతో ఆగ్రహం చెందిన వారు ఆమెపై కర్రలు, ఇటుకలతో దాడి చేసి చంపేశారు. శవాన్ని ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. విషయాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. భార్య ఇంటికి రాకపోవడంతో కొమురయ్య మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ రోజు దర్గా ప్రాంతంలో సంచరించిన యువకులపై నిఘా పెట్టారు. అయితే ఎలాగైనా పోలీసులకు విషయం తెలిసి పోతుందని పోడేటి కృష్ణ మంగళవారం పర్వతగిరి పోలీసులకు లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. పర్వతగిరి సీఐ కిషన్ ఆధ్వర్యంలో కొమురమ్మ మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించారు.