మాజీ రంజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ రంజీ క్రికెటర్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ మినిస్టర్ పీఏ పేరుతో మోసాలకు పాల్పడుతూ… ఫార్మా కంపెనీల నుంచి రూ.15 లక్షలు వసూలు చేశాడు. పొల్యూషన్ బోర్డు నోటీసులు ఇవ్వకుండా చూస్తానని కంపెనీలను బెదిరింపులకు గురిచేశాడు. దీంతో సోమవారం హైదరాబాద్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అంతేగాకుండా నాగరాజుపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. గతంలో క్రికెట్‌లో ఎంతో ప్రతిభ చూపిన నాగరాజు, 2006లో అండర్-14 […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ రంజీ క్రికెటర్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ మినిస్టర్ పీఏ పేరుతో మోసాలకు పాల్పడుతూ… ఫార్మా కంపెనీల నుంచి రూ.15 లక్షలు వసూలు చేశాడు. పొల్యూషన్ బోర్డు నోటీసులు ఇవ్వకుండా చూస్తానని కంపెనీలను బెదిరింపులకు గురిచేశాడు. దీంతో సోమవారం హైదరాబాద్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అంతేగాకుండా నాగరాజుపై ఇప్పటికే అనేక కేసులు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. గతంలో క్రికెట్‌లో ఎంతో ప్రతిభ చూపిన నాగరాజు, 2006లో అండర్-14 జట్టుకు ఎంపికై సత్తా చాటాడు. అనంతరం జల్సాలకు అలవాటుపడి, ఈజీ మనీకోసం మోసాలు చేయడం ప్రారంభించినట్టు సమాచారం. నాగరాజు స్వస్థలం శ్రీకాకులం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామంగా పోలీసులు గుర్తించారు.