వరంగల్‌లో తల్వార్‌తో వర్మ హల్ చల్.. కొండా దంపతుల ఎదుటే..(వీడియో)
దిశ, సినిమా: బతకితే ఆర్జీవీలా బతకాలి అని చాలా మంది అంటుంటారు. ఆయన అంత స్వేచ్ఛగా, ఓపెన్‌గా బతుకుతున్నాడన్న మాట. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేసే వర్మ తాజాగా హంతకుడి అవతారమెత్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అసలు విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఫ్యాక్షన్ ఫిల్మ్ ‘కొండా’. వరంగల్‌కు చెందిన రాజకీయ నాయకులు కొండా మురళి – సురేఖ దంపతుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ […]
దిశ, సినిమా: బతకితే ఆర్జీవీలా బతకాలి అని చాలా మంది అంటుంటారు. ఆయన అంత స్వేచ్ఛగా, ఓపెన్‌గా బతుకుతున్నాడన్న మాట. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ చేసే వర్మ తాజాగా హంతకుడి అవతారమెత్తాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అసలు విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఫ్యాక్షన్ ఫిల్మ్ ‘కొండా’. వరంగల్‌కు చెందిన రాజకీయ నాయకులు కొండా మురళి – సురేఖ దంపతుల జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందింస్తుండగా.. చిత్రం షూటింగ్ మొదలైన నుంచి వరంగల్‌లోనే హల్‌చల్ చేస్తు్న్నాడు వర్మ. ఈ క్రమంలోనే తాజాగా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఓ పార్టీ నిర్వహించగా.. ఆ పార్టీలో అల్విన్ గ్రీన్ డ్రెస్ ధరించిన వర్మ పెద్ద తల్వార్‌తో కేకును ముక్కులు ముక్కలుగా నరికేశాడు. అయితే ఈ వీడియోను తానే స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘కిల్లింగ్ ఏ కేక్ ఫర్ కొండా’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘అన్న ప్యాంట్ బెల్ట్ ఊడిపోతుంది జాగ్రత్త’ అని ఒకరంటే.. ‘ఓరిని పూనకం తగిలెయ్య’ అని మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేశారు.
KILLING a CAKE for KONDA pic.twitter.com/BXMmJIpV5F
— Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2021