రామతీర్థంలో టెన్షన్ టెన్షన్
దిశ, విశాఖపట్నం : బీజేపీ, జనసేన నేతలు చేపట్టిన రామతీర్ధం ధర్మయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది.ఏపీలో దేవాలయంలో విగ్రహాలపై దాడులకు నిరసగా మంగళవారం బీజేపీ చేపట్టిన రామతీర్ధ ధర్మయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ యాత్రలో పాల్గొనకుండా బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేశారు. రామతీర్ధం చేరుకుంటున్న బీజేపీ, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.పలువురు నేతలను అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపధ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము […]
దిశ, విశాఖపట్నం : బీజేపీ, జనసేన నేతలు చేపట్టిన రామతీర్ధం ధర్మయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది.ఏపీలో దేవాలయంలో విగ్రహాలపై దాడులకు నిరసగా మంగళవారం బీజేపీ చేపట్టిన రామతీర్ధ ధర్మయాత్రపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ యాత్రలో పాల్గొనకుండా బీజేపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేశారు. రామతీర్ధం చేరుకుంటున్న బీజేపీ, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.పలువురు నేతలను అరెస్ట్ చేశారు.ఈ క్రమంలో బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపధ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కిందపడిపోయారు. ఇదే సమయంలో కొంత మంది బీజేపీ నేతలను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసం విషయంలో సీఎం జగన్, మంత్రుల వైఖరిని తప్పుపట్టారు.ఏకపక్షంగా వ్యవహిరిస్తున్నారని, నియంతృత్వ పోకడలకు పోతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టు పాలన కొనసాగుతుందని, టీడీపీ, వైసీపీలు లాలూచీ పడ్డాయని, రామతీర్ధంలో పోలీసులు సెక్షన్ 30 అమలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏ విధంగా రామతీర్థం వెళ్లేందుకు అనుమతి ఇచ్చారో అంటూ ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే జగన్ ఎం చేశారంటూ తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. దీంతో సోమువీర్రాజు చూట్టూ పోలీసులు వలయంగా చుట్టుముట్టారు. మునుపెన్నూడూ లేని విధంగా సోమువీర్రాజు దూకుడు ప్రదర్శించిన తీరు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సమయంలో కొంత మంది జనసేన, బీజేపీ నాయకులను ముందస్తు ఆరెస్ట్‌లు చేసి వారి గృహాల్లో నుంచి బయటకు రానీయకుండా పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు.
దమ్ముంటే దాడిచేసిన వారిని అరెస్ట్ చేయండి..
రామతీర్థంలో బీజేపీ నేతల అరెస్టుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ విరుచుకుపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఆలయంపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని మాధవ్ సవాల్ విసిరారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని విమర్శించారు. శ్రీరాముడి శిరస్సు నరకడం రాష్ట్రానికి అరిష్టమని మాధవ్ అన్నారు.