బ్రూస్ లీ బర్త్ డేకు ‘వర్మ’ స్పెషల్ గిఫ్ట్

దిశ, వెబ్‌డెస్క్ : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. కేవలం మూడు పదుల వయస్సులో మార్షల్ ఆర్ట్స్‌లో అందనంత ఎత్తుకు ఎదిగిన బ్రూస్ లీది రేపు బర్త్ డే. ఆయన 80వ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 27వ తేదీ ఉదయం 11గంటలకు వర్మ తీసిన మరో కొత్త సినిమా ‘లడ్ కి’లో సునిధి చౌహాన్ పాడిన సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ […]

Update: 2020-11-26 11:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాంగోపాల్ వర్మ మరో సంచలనానికి తెరలేపారు. కేవలం మూడు పదుల వయస్సులో మార్షల్ ఆర్ట్స్‌లో అందనంత ఎత్తుకు ఎదిగిన బ్రూస్ లీది రేపు బర్త్ డే. ఆయన 80వ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 27వ తేదీ ఉదయం 11గంటలకు వర్మ తీసిన మరో కొత్త సినిమా ‘లడ్ కి’లో సునిధి చౌహాన్ పాడిన సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్. ‘పూజా బోఫిసిల్’ అనే కొత్త నటీని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాడు వర్మ. దీనికి ‘లడ్ కి’ అనే పేరును చిత్రం బృందం ఖరారు చేసింది.

ఈ మూవీలో బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్‌ను ఓ మహిళ ఎలా సాధన చేస్తుందనే దానిపై తెరకెక్కినట్లు టీజర్‌లో చూపించాడు వర్మ. అంతేకాకుండా, ఇండియాలోనే తొలి మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ గా తెరకెక్కుతున్న తొలి చిత్రంగా లడ్ కిని అభివర్ణించాడు. తన సినిమాల్లో అమ్మాయిల అందాలను ప్రేమించే వర్మ లడ్ కి మూవీలోనూ తనదైన న్యూడిటికి పెద్దపీట వేశాడు. చీర కట్టుకున్న హీరోయిన్ రౌడీలను గాలిలో ఎగిరి తన్నే సన్నివేశంలో మోకాలి పైభాగంపై హైలేట్ అయ్యేలా స్లో మోషన్ లో షాట్ ను చిత్రీకరించాడు. దీన్ని బట్టి ఇందులో మాస్ మసాలాకు వర్మ ప్రియారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి వర్మ ఏదీ చేసినా అందులో కాంట్రవర్సీ కామన్ అయిపోయింది. లడ్ కి టీజర్ ను చూసిన వాళ్లు ఎప్పటిలాగే వర్మ ఇక మారడు అని కొందరు అనుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆయన పిచ్చికి ఫిదా అవుతున్నారు. ఏదేమైనా ‘వర్మ అంటే కాంట్రవర్సీ.. కాంట్రవర్సీ అంటే వర్మ’ అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News