సీఏఏతో ముస్లీంలకు ముప్పు లేదు: రజినీకాంత్

            కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరగుతున్న వేళ.. సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ, జాతీయ జనగణన పట్టిక(ఎన్పీఆర్)లపై స్పందించారు. సీఏఏతో ముస్లీంలకు ఎలాంటి ముప్పు లేదనీ, ఎన్పీఆర్ దేశానికి చాలా అవసరమని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎన్పీఆర్ నిర్వహించిందని గుర్తుచేశారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ మీడిమా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏ వల్ల ముస్లీంలకు ఇబ్బందులు ఎదురయ్యే […]

Update: 2020-02-05 03:10 GMT

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరగుతున్న వేళ.. సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ, జాతీయ జనగణన పట్టిక(ఎన్పీఆర్)లపై స్పందించారు. సీఏఏతో ముస్లీంలకు ఎలాంటి ముప్పు లేదనీ, ఎన్పీఆర్ దేశానికి చాలా అవసరమని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎన్పీఆర్ నిర్వహించిందని గుర్తుచేశారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ మీడిమా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏ వల్ల ముస్లీంలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితే వస్తే.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తనే ముందుంటానని చెప్పారు. ఈ చట్టం వల్ల భారత పౌరులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. దేశవిభజన అనంతరం భారత్ లో ఉండాలని నిర్ణయించుకున్న ముస్లీంలను దేశం నుంచి పంపించాలని ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు. కొన్ని పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం సీఏఏకు వ్యతిరేకంగా ప్రజలను ఉసిగొల్పుతున్నాయని మండిపడ్డారు. సీఏఏ నిరసనలకు మతపెద్దలు మద్దతు తెలపడం సరికాదని అన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకించడమంటే, రాజ్యాంగంలోని లౌకికసూత్రాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ముస్లీంలపై వివక్ష చూపేవారే ఈ చట్టానికి మద్దతు తెలుపరని అన్నారు. కాగా, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరగడం పట్ల రజినీ గతేడాది డిసెంబర్ లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘హింస, అర్లర్ల వల్ల సమస్యలు పరిష్కారం కావు. దేశభద్రతను దృష్టిలో పెట్టకుని దయచేసి ప్రజలంతా ఐక్యంగా ఉండాలి’ అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News