అపోలో ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి సినీ నటుడు రజనీకాంత్ ఆదివారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 25న హై బీపీతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ మూడ్రోజుల పాటు చికిత్స పొందారు. రజనీకాంత్‌కు వైద్యులు చేసిన అన్ని పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా రావడంతో డిశ్చార్జ్ చేశారు. రజనీ ఆరోగ్యం మెరుగుపడిందని, ఒత్తిడికి లోనవకుండా వారంరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఫిజికల్ యాక్టివిటి తక్కువగా చేయాలని అపోలో వైద్యులు సూచించారు. కాసేపట్లో రజనీకాంత్ చెన్నై బయల్దేరి […]
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి సినీ నటుడు రజనీకాంత్ ఆదివారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 25న హై బీపీతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్ మూడ్రోజుల పాటు చికిత్స పొందారు. రజనీకాంత్‌కు వైద్యులు చేసిన అన్ని పరీక్షల్లో రిపోర్టులు నార్మల్‌గా రావడంతో డిశ్చార్జ్ చేశారు. రజనీ ఆరోగ్యం మెరుగుపడిందని, ఒత్తిడికి లోనవకుండా వారంరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఫిజికల్ యాక్టివిటి తక్కువగా చేయాలని అపోలో వైద్యులు సూచించారు. కాసేపట్లో రజనీకాంత్ చెన్నై బయల్దేరి వెళ్లనున్నారు.