యువ క్రికెటర్ నితీశ్‌కు రూ.25 లక్షలు ప్రోత్సాహం.. త్వరలో అందజేత
యువ క్రికెటర్ నితీశ్‌కు ఏపీ ప్రభుత్వం రూ.25 లక్షలు ప్రోత్సాహం ప్రకటించింది.
దిశ, వెబ్ డెస్క్: యువ క్రికెటర్ నితీశ్(Young cricketer Nitish) చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్(Test match)లో ఆయన సెంచరీ చేశారు. ఆసిస్ గడ్డపై లోయర్ ఆర్డర్‌లో బరిలోకి దిగి అత్యధిక స్కోరు చేశారు. విశాఖకు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి.. తొలి టెస్ట్ సిరీస్‌లోనే సెంచరీ చేయడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అటు ఏపీ ప్రభుత్వం తరపున నితీశ్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు(Andhra Cricket Association President), విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(Vijayawada MP Keshineni Chinni) ప్రశంసించారు. రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామని తెలిపారు. దేశంలో అత్యాధునిక వసతులతో అమరావతిలో స్టేడియాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేలా విశాఖ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నామని కేశినేని చిన్ని పేర్కొన్నారు.
శాప్ ఛైర్మన్ రవినాయుడు( Sap Chairman Ravi Naidu) కూడా స్పందించారు. విజాగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ప్రదర్శన భేష్ అని వ్యాఖ్యానించారు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్‌లో తొలి సెంచరీ అద్భుతమని ప్రశంసించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ నితీశ్ కుమార్ అత్యుత్తమంగా రాణించారని కితాబిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో నితీశ్ సెంచరీ చేయడం ఏపీకి గర్వకారణమని శాప్ ఛైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు.