శిల్ప నవ్వులు.. వజ్రపు మెరుపులు : రాజ్ కుంద్రా
పొడవుకాళ్ల సుందరి, బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసు పెరుగుతున్నా, ఇప్పటికీ వన్నె తరగని అందం ఆమెది. తన ఫిట్‌నెస్, యోగాసనాలతో అందర్నీ ఆకట్టుకునే ఈ బ్యూటీపై తన భర్త రాజ్ కుంద్రా ప్రేమవర్షం కురిపిస్తున్నాడు. మామూలుగానే తన భార్యపై ప్రేమ వ్యక్తం చేయడానికి రాజ్.. తేదీలు, వారాలు చూసుకోడు. ఎప్పటికప్పుడు తన మనసులో అనిపించింది సోషల్ మీడియా వేదికగా చెబుతుంటాడు. తాజాగా శిల్పతో కలిసి ఉన్న ఓ బ్లాక్ అండ్ […]
పొడవుకాళ్ల సుందరి, బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయసు పెరుగుతున్నా, ఇప్పటికీ వన్నె తరగని అందం ఆమెది. తన ఫిట్‌నెస్, యోగాసనాలతో అందర్నీ ఆకట్టుకునే ఈ బ్యూటీపై తన భర్త రాజ్ కుంద్రా ప్రేమవర్షం కురిపిస్తున్నాడు. మామూలుగానే తన భార్యపై ప్రేమ వ్యక్తం చేయడానికి రాజ్.. తేదీలు, వారాలు చూసుకోడు. ఎప్పటికప్పుడు తన మనసులో అనిపించింది సోషల్ మీడియా వేదికగా చెబుతుంటాడు. తాజాగా శిల్పతో కలిసి ఉన్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసుకుంటూ.. ఆమెను అద్భుతంగా వర్ణించాడు.
‘నీ నవ్వులు వజ్రపు మెరుపులు తలపిస్తాయి. నలుపు తెలుపు చిత్రాల్లోనూ.. రంగులు నింపుతాయి. నా పార్టనర్‌గా ఉన్నందుకు కృతజ్ఞతలు. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను’ అంటూ రాజ్ కుంద్రా శిల్పాశెట్టిపై తనకున్న ప్రేమను తెలియజేశాడు.
జూన్ 8న శిల్పాశెట్టి పుట్టిన రోజున కూడా.. ‘నా డార్లింగ్ వైఫ్.. నీ ప్రేమతో నా ఇమ్ పర్‌ఫెక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్షన్స్‌గా మార్చేశావు. నీ నవ్వు చూస్తే చాలు.. నా చీకటి రోజుల్లోనూ వెలుగులు వెల్లివిరుస్తాయి. నువ్వు నా పిల్లలకు తల్లివి మాత్రమే కాదు.. నా హృదయ రాణివి. నా జీవితానికి దేవతవు. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే జాను’ అంటూ రాజ్ కుంద్రా పోస్ట్ చేసి శిల్పను సర్‌ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/CCH0f2JAyNi/?utm_source=ig_web_copy_link