మాస్క్ అడిగినందుకు.. పోలీసులకు ధమ్ కీ ఇచ్చిన మేయర్ అల్లుడు

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్యులు, అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. మాస్క్ పెట్టుకోని వారికి ఫైన్స్ కూడా విధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాస్క్ ధరించాలని చెప్పినందుకు ఓ మహిళ.. ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. Hii @IBC24News @ABPNews @indiatvnews @aajtak @Republic_Bharat @RaipurPoliceCG Boy in white shirt is nephew of raipur mayor […]

Update: 2021-04-21 08:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్యులు, అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. మాస్క్ పెట్టుకోని వారికి ఫైన్స్ కూడా విధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మాస్క్ ధరించాలని చెప్పినందుకు ఓ మహిళ.. ఢిల్లీ పోలీసులతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది.

రాయ్‌పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ మేనల్లుడు.. మాస్కు పెట్టుకోకుండా స్కూటీపై వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ యువకుడు ఆగ్రహంతో.. నన్నే ఆపుతారా అంటూ.. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా వెంటనే ఫోన్ తీసి కాల్ చేస్తూ.. మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా అంటూ బెదిరించాడు. అయితే పోలీసులు మాత్రం అతడిని తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News