తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన…

దిశ, వెబ్ డెస్క్ : వేసవిలో మండుతున్న ఎండలకు అకాల వర్షాలు కొంత ఉపశమనే. కానీ రైతన్నకు ఈ అకాల వర్షాలు మాత్రం కన్నీరు మిగిలిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలు నేలరాలి రైతులు నష్టపోతుంటే.. మరోసారి వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు పాటు వర్షాలు పడుతాయని వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు […]

Update: 2021-04-23 05:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : వేసవిలో మండుతున్న ఎండలకు అకాల వర్షాలు కొంత ఉపశమనే. కానీ రైతన్నకు ఈ అకాల వర్షాలు మాత్రం కన్నీరు మిగిలిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు చేతికొచ్చిన పంటలు నేలరాలి రైతులు నష్టపోతుంటే.. మరోసారి వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు పాటు వర్షాలు పడుతాయని వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు తెలంగాణాలో కూడా వడగళ్లతో కూడిన వర్షాలు వచ్చే నాలుగు రోజుల పాటు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Tags:    

Similar News