రూ.కోటి లంచం కేసులో మహేంద్ర సింగ్ అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: రూ.కోటి లంచం తీసుకున్న కేసులో సీనియర్ రైల్వే అధికారి మహేంద్ర సింగ్ చౌహాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 1985 బ్యాచ్‌కు చెందిన భారతీయ రైల్వే సీనియర్ అధికారి మహేంద్ర సింగ్ చౌహాన్.. నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే ఇచ్చిన కాంట్రాక్టులకు సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా మారడానికి రూ.కోటి లంచం డిమాండ్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ లంచం కేసుకు సంబంధించి సెంట్రల్ […]

Update: 2021-01-17 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: రూ.కోటి లంచం తీసుకున్న కేసులో సీనియర్ రైల్వే అధికారి మహేంద్ర సింగ్ చౌహాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. 1985 బ్యాచ్‌కు చెందిన భారతీయ రైల్వే సీనియర్ అధికారి మహేంద్ర సింగ్ చౌహాన్.. నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే ఇచ్చిన కాంట్రాక్టులకు సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా మారడానికి రూ.కోటి లంచం డిమాండ్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ లంచం కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐదు రాష్ట్రాల్లోని 20చోట్ల సోదాలు నిర్వహిస్తుంది. మహేంద్ర సింగ్.. ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు.

Tags:    

Similar News