వచ్చే నెలలో రాహుల్ గాంధీ పర్యటన.. కేసీఆర్‌ను నిలదీస్తాం
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు, పథకాలతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. దళిత బంధు పథకంతో చాలా అన్యాయం జరుగుతుందన్నారు. టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశం గాంధీభవన్‌లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఠాగూర్ మాట్లాడారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు మరింత దూకుడుగా పని చేయాలని, మీటింగ్కురాని వాళ్లకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. వచ్చేనెల 17 వరకు దండోరా సభలు ఉంటాయని, […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు, పథకాలతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. దళిత బంధు పథకంతో చాలా అన్యాయం జరుగుతుందన్నారు. టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశం గాంధీభవన్‌లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఠాగూర్ మాట్లాడారు. నియోజకవర్గాల సమన్వయకర్తలు మరింత దూకుడుగా పని చేయాలని, మీటింగ్కురాని వాళ్లకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. వచ్చేనెల 17 వరకు దండోరా సభలు ఉంటాయని, సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని వెల్లడించారు. రాహుల్ గాంధీని ఎక్కడ సభకు తీసుకురావాలనే విషయం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఠాగూర్ వివరించారు.