తాజ్‌మహల్‌ను అమ్మినా ఆశ్చర్యం లేదు
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్ది ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ రాజకీయాలను వేడిక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అటు ప్రధాని మోదీ, ఇటు రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. జాంగ్పురాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు గుప్పించారు. కేవలం తన కార్పొరేట్ శక్తుల కోసం ప్రధాని ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతున్నారని.. […]
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్ది ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ రాజకీయాలను వేడిక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అటు ప్రధాని మోదీ, ఇటు రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. జాంగ్పురాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు గుప్పించారు. కేవలం తన కార్పొరేట్ శక్తుల కోసం ప్రధాని ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెడుతున్నారని.. అవకాశం వస్తే తాజ్‌మహల్ అమ్మినా ఆశ్చర్యపోనవసరం లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఉద్యోగ కల్పనకు మోదీ, కేజ్రీవాల్ సర్కార్లు తీసుకున్న చర్యలేంటో బయటపెట్టాలని రాహుల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.