ప్రధాని మోడీ పిరికివాడు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: దేశ భూభాగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాకు ఇచ్చాడని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని ఓ పిరికివాడు అని, చైనాను ఎదురించి నిలబడలేకపోయాడని తెలిపారు. భారత భూభాగమైన ఫింగర్ 4 వదిలి ఫింగర్ 3 వద్ద పహారా కోసం భారత బాలగాలు వెనక్కి రావడంపై ఆయన ప్రశ్నించారు. చైనాకు భూభాగాన్ని ఎందుకు వదలిపెట్టారో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. ఆయన భారత సైనికుల త్యాగాలకు ఆయన ద్రోహం తలపెట్టారని, దీనిని దేశంలో […]
న్యూఢిల్లీ: దేశ భూభాగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాకు ఇచ్చాడని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని ఓ పిరికివాడు అని, చైనాను ఎదురించి నిలబడలేకపోయాడని తెలిపారు. భారత భూభాగమైన ఫింగర్ 4 వదిలి ఫింగర్ 3 వద్ద పహారా కోసం భారత బాలగాలు వెనక్కి రావడంపై ఆయన ప్రశ్నించారు. చైనాకు భూభాగాన్ని ఎందుకు వదలిపెట్టారో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. ఆయన భారత సైనికుల త్యాగాలకు ఆయన ద్రోహం తలపెట్టారని, దీనిని దేశంలో ఏ ఒక్కరూ సహించబోరని తెలిపారు.
తూర్పు లఢాఖ్‌లోని పాంగాంగ్ సో నుంచి బలగాల ఉపసంహరణపై ఇండియా, చైనాలు ఒప్పందానికి వచ్చాయని పార్లమెంట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. దేశ భూభాగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రధాన మంత్రిపై ఉన్నదని పునరుద్ఘాటించారు. భూభాగాన్ని ఎలా రక్షించాలి అనేది నరేంద్ర మోడీ సమస్య అని, తనదు కాదని తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై కూడా విరుచుకుపడ్డారు. చైనా బలగాలు ప్రవేశించిన డెస్పాంగ్ మైదాన ప్రాంతం వ్యూహాత్మక పరంగా భారత్‌కు అత్యంత కీలకమని, దీనిపై రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో మాట్లడకపోవడాన్ని తప్పు పట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత భూభాగాన్ని చైనాకు వదిలేశాడనేది నిజమని పునరుద్ఘాటించారు.