'టీమ్ ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ అవసరం లేదు'

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత పరిమిత ఓవర్ల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వెంట వెళ్లిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించాలని పలు వైపుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు కూడా రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా రావాలంటూ సూచిస్తుండగా.. వసీమ్ జాఫర్ మాత్రం ఆ ఆలోచనే చేయవద్దని అంటున్నారు. రాహుద్ ద్రవిడ్ ఎప్పటిలాగే అండర్-19, భారత్-ఏ కోచ్‌గానే కొనసాగాలని […]

Update: 2021-07-09 11:44 GMT

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత పరిమిత ఓవర్ల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వెంట వెళ్లిన సంగతి తెలిసిందే. హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగిసిన తర్వాత రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించాలని పలు వైపుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు కూడా రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా రావాలంటూ సూచిస్తుండగా.. వసీమ్ జాఫర్ మాత్రం ఆ ఆలోచనే చేయవద్దని అంటున్నారు.

రాహుద్ ద్రవిడ్ ఎప్పటిలాగే అండర్-19, భారత్-ఏ కోచ్‌గానే కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డాడు. నేషనల్ క్రికెట్ ఆకాడమీ డైరెక్టర్‌గా ద్రవిడ్ జూనియర్లను మలచడంలో ఎంతో కృషి చేశాడు. ప్రస్తుతం ఉన్న రిజర్వ్ బెంచ్ ద్రవిడ్ కోచింగ్ ఫలితమే. సీనియర్లకు ద్రవిడ్ చెప్పే కొత్త పాఠాలు ఏముంటాయని జాఫర్ అన్నాడు. అంతర్జాతీయ జట్టు కోచ్‌గా కంటే ఎన్‌సీఏ చీఫ్‌గా అతడి సేవలు అవసరం అని జాఫర్ చెప్పాడు.

Tags:    

Similar News