మరక మసకబారాకే టచ్‌లోకి..

          తనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయాకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు తెలిపారు.అప్పటివరకు పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్, ఇన్‌చార్జ్ కృష్ణదాస్‌కు లేఖ రాశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కావున తన నిర్ణయాన్నిస్వాగతించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రఘునందనరావుపై అత్యాచారం కేసు నమోదైన విషయం అందరికి విదితమే. గత 12 […]

Update: 2020-02-11 00:05 GMT

తనపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయాకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు తెలిపారు.అప్పటివరకు పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్, ఇన్‌చార్జ్ కృష్ణదాస్‌కు లేఖ రాశారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని కావున తన నిర్ణయాన్నిస్వాగతించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రఘునందనరావుపై అత్యాచారం కేసు నమోదైన విషయం అందరికి విదితమే. గత 12 ఏళ్లుగా రఘునందనరావు బలవంతంగా తనపై అత్యాచారం చేస్తున్నాడని, జ్యోతినగర్‌కు చెందిన ఓ వివాహిత సైబరాబాద్ పోలీస్‌ కమిషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసింది.కమిషనర్ ఆదేశాలతో రామచంద్రాపురం పీఎస్‌లో రఘునందన్‌రావుపై అత్యాచారం, బెదిరింపులు, ప్రాణహాని తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Tags:    

Similar News