ట్రస్ట్ ఇట్.. ఆ ట్రస్ట్ కిడ్స్‌కు నెగెటివ్

రాఘవ లారెన్స్ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. భారీగా విరాళాలు అందించిన ఆయన.. కరోనా కష్టకాలంలో తన ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు చేపట్టి ఆకలి తీర్చారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూడా అందించారు. అయితే ఈ మధ్య రాఘవ లారెన్స్ ట్రస్ట్ కు చెందిన 18 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ రాగా చాలా ఆందోళన చెందారు లారెన్స్. వెంటనే వారిని చెన్నైలోని లయోల కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్ -19 […]

Update: 2020-06-05 02:53 GMT

రాఘవ లారెన్స్ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. భారీగా విరాళాలు అందించిన ఆయన.. కరోనా కష్టకాలంలో తన ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు చేపట్టి ఆకలి తీర్చారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూడా అందించారు. అయితే ఈ మధ్య రాఘవ లారెన్స్ ట్రస్ట్ కు చెందిన 18 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ రాగా చాలా ఆందోళన చెందారు లారెన్స్. వెంటనే వారిని చెన్నైలోని లయోల కాలేజ్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్ -19 క్యాంప్‌కు తరలించి చికిత్స అందించారు.

కాగా ఇప్పుడు పిల్లలంతా కరోనా నుంచి కోలుకున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేశారు లారెన్స్. కరోనా టెస్ట్ చేశాకా పలు మార్లు నెగెటివ్ రావడంతో.. వారు సురక్షితంగా మళ్లీ ట్రస్ట్‌కు వచ్చేశారని ఆనందం వ్యక్తం చేశారు. రోగులందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్న వైద్యులు, సంబంధిత అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నా సేవే నా పిల్లలని కాపాడిందని నమ్ముతున్నానన్న లారెన్స్.. పిల్లలు ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ చెప్పారు.

Tags:    

Similar News