జానపదానికి లారెన్స్ చేయూత..

ఫిల్మ్ ఇండస్ట్రీలో సైడ్ డ్యాన్సర్‌గా తన ప్రస్థానాన్ని మొదలెట్టిన రాఘవ లారెన్స్.. కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా.. ఇలా టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకోగలిగాడు. ఈ క్రమంలో తన జీవన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న లారెన్స్.. ట్రస్ట్ స్థాపించి అనాథలను అక్కున చేర్చుకున్నాడు. వికలాంగులకు ఆపద్బాంధవుడుగా మారాడు. https://twitter.com/offl_Lawrence/status/1271411799162630145?s=20 కానీ ఎప్పుడూ ఏ బ్రాండ్‌ను కూడా ప్రమోట్ చేసేందుకు గానీ, బ్రాండ్ అంబాసిడర్‌గా గానీ ఉండేందుకు ఇష్టపడని లారెన్స్.. తొలిసారిగా జానపద కళాకారుల […]

Update: 2020-06-12 07:51 GMT

ఫిల్మ్ ఇండస్ట్రీలో సైడ్ డ్యాన్సర్‌గా తన ప్రస్థానాన్ని మొదలెట్టిన రాఘవ లారెన్స్.. కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా.. ఇలా టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకోగలిగాడు. ఈ క్రమంలో తన జీవన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న లారెన్స్.. ట్రస్ట్ స్థాపించి అనాథలను అక్కున చేర్చుకున్నాడు. వికలాంగులకు ఆపద్బాంధవుడుగా మారాడు.

https://twitter.com/offl_Lawrence/status/1271411799162630145?s=20

కానీ ఎప్పుడూ ఏ బ్రాండ్‌ను కూడా ప్రమోట్ చేసేందుకు గానీ, బ్రాండ్ అంబాసిడర్‌గా గానీ ఉండేందుకు ఇష్టపడని లారెన్స్.. తొలిసారిగా జానపద కళాకారుల కోసం ‘100 ఫర్ 1000 ఫండ్’ రేజర్ క్యాంపెయిన్‌కు అంబాసిడర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు. సంపర్ణ అనే సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని.. మన వంతు సహాయం అందిద్దామని పిలుపునిచ్చారు రాఘవ.

‘మార్చి నుంచి జులై మధ్య జానపద కళాకారులు ఏడాదికి సరిపోయే సంపాదన కోసం ప్రదర్శనలు ఇస్తుంటారు. ఆ ప్రదర్శనల ద్వారా మనకు పలు విషయాల పట్ల అవగాహన కల్పిస్తుంటారు. కానీ కరోనా మహమ్మారి వల్ల అది సాధ్యం కాలేదు.. అందుకే వారు సహాయం కోసం అర్థిస్తున్నారని’ తెలిపారు. వీరికి చేయూతనిచ్చి ఆదుకునేందుకు.. వంద రూపాయలైనా సహాయం అందించాలని కోరారు లారెన్స్. తద్వారా వేల జానపద కళాకారుల కుటుంబాలను ఆదుకుందామని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా లక్షల మంది జానపద కళాకారులు ఉన్నారని.. ఈ కార్యక్రమం ఒక మాసివ్ మూమెంట్‌గా మారి అందరినీ ఆదుకునేలా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు రాఘవ లారెన్స్.

Tags:    

Similar News