ఆ విషయంలో తప్పు నాదే.. ఎవరినీ బ్లేమ్ చేయను : యంగ్ హీరోయిన్

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ రాధికా మదన్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాకు ఆడిషన్ ఇచ్చినట్లు తెలిపింది. కానీ అందులో సెలెక్ట్ కాలేకపోయానని చెప్పింది. ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ సినిమా ద్వారా పరిచయం కాగా.. బ్లాక్ బస్టర్‌గా నిలిచి వారి కెరియర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్లింది. ఒకవేళ అదే ఛాన్స్ రాధికకు వచ్చి ఉంటే ఓ రేంజ్‌లో ఉండేదని అభిమానులు అనుకుంటుండగా.. ఇది […]

Update: 2021-08-05 02:12 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ బ్యూటీ రాధికా మదన్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాకు ఆడిషన్ ఇచ్చినట్లు తెలిపింది. కానీ అందులో సెలెక్ట్ కాలేకపోయానని చెప్పింది. ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ సినిమా ద్వారా పరిచయం కాగా.. బ్లాక్ బస్టర్‌గా నిలిచి వారి కెరియర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకువెళ్లింది. ఒకవేళ అదే ఛాన్స్ రాధికకు వచ్చి ఉంటే ఓ రేంజ్‌లో ఉండేదని అభిమానులు అనుకుంటుండగా.. ఇది కేవలం తన తప్పేనని, తన లైఫ్‌లో ఇచ్చిన వరెస్ట్ ఆడిషన్ అదేనని చెప్పింది. ఈ విషయంలో ఎవరినీ బ్లేమ్ చేయాలనుకోవడం లేదన్న రాధిక.. ఆ తర్వాత 15 రోజులకే ‘పటాకా’ ఆడిషన్‌కు అటెండ్ అయ్యానని వివరించింది. అందులో బెస్ట్‌గా పర్ఫార్మ్ చేశాను కాబట్టే ఛాన్స్ వచ్చిందని తెలిపింది.

డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ తప్పకుండా తనను సెలెక్ట్ చేస్తారని అప్పుడే అర్థమైందని తెలిపింది. ఆడిషన్ ఇచ్చేటప్పుడు ఒకే మంత్ర ఫాలో అవుతానని, ఆ రెండు నిమిషాలు క్యారెక్టర్‌లో జీవిస్తే తప్పకుండా ఛాన్స్ వస్తుందని నమ్ముతానని చెప్పింది. ‘పటాకా, ఆంగ్రేజీ మీడియమ్’ సినిమాలకు బెస్ట్ ఆడిషన్ ఇచ్చానన్న భామ.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నానని తెలిపింది.

Tags:    

Similar News