క్రీడలు వారిలో నూతనోత్తేజాన్ని నింపుతాయి. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా.. 

దిశ, జవహర్ నగర్: విధులు నిర్వర్తించే సమయంలో పోలీసు సిబ్బంది రోజువారీ ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు క్రీడలు దోహదపడతాయని, వారిలో నూతనోత్తేజం నింపుతుందని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా అన్నారు. ఈమేరకు మంగళవారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమైన రాచకొండ కమిషనరేట్‌ 4వ వార్షిక స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌-2021లో ఆయన మాట్లాడారు. సరూర్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, గోషామహల్‌లోని నాలుగు వేదికల్లో పోటీలు జరుగుతాయని, డిసెంబర్‌ 10న ముగింపు వేడుకలు జరుగుతాయని, రాచకొండ […]

Update: 2021-12-08 07:44 GMT

దిశ, జవహర్ నగర్: విధులు నిర్వర్తించే సమయంలో పోలీసు సిబ్బంది రోజువారీ ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు క్రీడలు దోహదపడతాయని, వారిలో నూతనోత్తేజం నింపుతుందని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా అన్నారు. ఈమేరకు మంగళవారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమైన రాచకొండ కమిషనరేట్‌ 4వ వార్షిక స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌-2021లో ఆయన మాట్లాడారు. సరూర్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, గోషామహల్‌లోని నాలుగు వేదికల్లో పోటీలు జరుగుతాయని, డిసెంబర్‌ 10న ముగింపు వేడుకలు జరుగుతాయని, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు క్రీడలు ఎంతగానో దోహద పడతాయన్నారు. స్పోర్ట్స్ మీట్ వల్ల పోలీసుల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు, మంచి ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డిసిపి రక్షిత కె మూర్తి ఐపీఎస్, క్రైమ్ డిసిపి పి యాదగిరి, డీ సీ పీ కే నారాయణ రెడ్డి, డిసిపి అడ్మిన్ కే శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News