బహుజన ఆడబిడ్డను గెలిపించాలి

దిశ ప్రతినిధి, మెదక్: దళిత బహుజనుల తరపున మన ఆడబిడ్డ కత్తి కార్తీకను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కత్తి కార్తీక ఆర్. కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై ఆర్. కృష్ణయ్య సానుకూలంగా స్పందిస్తూ.. సరైన సమయంలో బహుజన ఆడబిడ్డ ముందుకు వచ్చినందుకు గానూ సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం […]

Update: 2020-10-08 07:51 GMT

దిశ ప్రతినిధి, మెదక్: దళిత బహుజనుల తరపున మన ఆడబిడ్డ కత్తి కార్తీకను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కత్తి కార్తీక ఆర్. కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు.

దీనిపై ఆర్. కృష్ణయ్య సానుకూలంగా స్పందిస్తూ.. సరైన సమయంలో బహుజన ఆడబిడ్డ ముందుకు వచ్చినందుకు గానూ సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇదే సంకల్పంతో ముందుకు సాగాలని అన్నారు. బహుజన ఆడబిడ్డ కత్తి కార్తీక సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు.

Tags:    

Similar News