పాక్ క్రికెట్ జట్టుకు నో క్వారంటైన్..
దిశ, స్పోర్ట్స్ : కరోనా కష్టకాలంలో ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ గాడిలో పడుతున్నది. ఇంగ్లాండ్‌లో ద్వైపాక్షిక పర్యటనలు, ఐపీఎల్, పాకిస్తాన్‌లో జింబాబ్వే పర్యటన తర్వాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. తాజాగా పాకిస్తాన్ జట్టు కూడా న్యూజీలాండ్ పర్యటనకు బయలుదేరింది. న్యూజీలాండ్‌లో కరోనా నేపథ్యంలో కఠినమైన నిబంధనలు విధించారు. అయితే న్యూజీలాండ్ క్రికెట్ అభ్యర్థన మేరకు అక్కడి ప్రభుత్వం పాకిస్తాన్ జట్టుకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. 35 మంది క్రికెట్లు 15 మంది స్టాఫ్ న్యూజీలాండ్ […]
దిశ, స్పోర్ట్స్ : కరోనా కష్టకాలంలో ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్ గాడిలో పడుతున్నది. ఇంగ్లాండ్‌లో ద్వైపాక్షిక పర్యటనలు, ఐపీఎల్, పాకిస్తాన్‌లో జింబాబ్వే పర్యటన తర్వాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. తాజాగా పాకిస్తాన్ జట్టు కూడా న్యూజీలాండ్ పర్యటనకు బయలుదేరింది. న్యూజీలాండ్‌లో కరోనా నేపథ్యంలో కఠినమైన నిబంధనలు విధించారు. అయితే న్యూజీలాండ్ క్రికెట్ అభ్యర్థన మేరకు అక్కడి ప్రభుత్వం పాకిస్తాన్ జట్టుకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. 35 మంది క్రికెట్లు 15 మంది స్టాఫ్ న్యూజీలాండ్ చేరుకోగానే మూడు రోజుల పాటు విడివిడిగా ఐసోలేషన్‌లో ఉండాలి.
నాలుగో రోజు కోవిడ్ టెస్ట్ అనంతరం 15 మంది ఒక బృందంగా చేసి విడిగా ఉంచుతారు. 10 రోజుల తర్వాత మరోసారి వీరందరికీ కరోనా టెస్టులు నిర్వహించి నెగెటివ్ వచ్చిన వారందరూ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. సాధారణంగా 14 రోజుల ఐసోలేషన్‌లో ఉండాలి కానీ.. ఆటగాళ్లు మానసికంగా కుంగిపోకుండా నాలుగు రోజుల తర్వాత 15 మంది చొప్పున కలసి ఉండటానికి న్యూజీలాండ్ ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ 18 నుంచి టీ20 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్నది.