కరోనా వల్ల నాకు మంచే జరిగింది : పీవీ సింధు
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ వల్ల ఆటకు విరామం రావడం తనకు మంచే జరిగిందని స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడటంతో తాను ఆటలో నైపుణ్యత, సాంకేతిక అంశాలపై మరింత దృష్టి పెట్టడానికి సహాయపడిందని ఆమె అన్నారు. ప్రస్తుతం ఒలింపిక్స్ వెళ్లే సన్నాహాల్లో ఉన్న సింధు.. వర్చువల్ పద్దతిలో ఒక ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. ‘ఒలింపిక్ సన్నాహాలకు కరోనా వైరస్ ఏ మాత్రం అడ్డంకి కాలేదు. ఈ విరామంలో నా టెక్నిక్ మీద […]
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ వల్ల ఆటకు విరామం రావడం తనకు మంచే జరిగిందని స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడటంతో తాను ఆటలో నైపుణ్యత, సాంకేతిక అంశాలపై మరింత దృష్టి పెట్టడానికి సహాయపడిందని ఆమె అన్నారు. ప్రస్తుతం ఒలింపిక్స్ వెళ్లే సన్నాహాల్లో ఉన్న సింధు.. వర్చువల్ పద్దతిలో ఒక ఇంటరాక్షన్‌లో పాల్గొన్నారు. ‘ఒలింపిక్ సన్నాహాలకు కరోనా వైరస్ ఏ మాత్రం అడ్డంకి కాలేదు. ఈ విరామంలో నా టెక్నిక్ మీద దృష్టి పెట్టాను.
నాకు తగినంత సమయం దొరికింది. సాధారణంగా ఏదైనా టోర్నీకి వెళ్లాలంటే సాధనకు తగినంత సమయం ఉండదు. కానీ ఒలింపిక్స్ కోసం నాకు తగినంత సమయం దొరికింది. నేను ఆట విషయంలో చాలా నేర్చుకున్నాను. లీగ్‌లో మంచి డ్రా దొరికింది. నేను ఈ స్టేజ్‌లో మంచి ప్రదర్శన చేస్తానని భావిస్తున్నాను. నాపై భారీ అంచనాలు, బాధ్యతలు ఉన్నాయని తెలుసు. ఈ సారి మీ అందరి మద్దతుతో పతకం సాధిస్తాననే ధీమా ఉన్నది’ అని పీవీ సింధు చెప్పింది.