మీరు నాకు ఓట్లేయలేదు.. కానీ,…

దిశ, కరీంనగర్: ‘మీరు ఓట్లేయకున్నా నేను మాత్రం మీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తా.. మీరు ఓట్లేసి గెలిపించినోళ్లు మాత్రం హైదరాబాద్ లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి ఫొటోలు దిగి పోతున్నారు’ అంటూ తన మనసులో ఉన్నది అతను చెప్పుకొచ్చాడు. భూపాలపల్లి జిల్లా పల్మెల మండలంలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 35 ఏళ్ల పాటు మంథని నుంచి ప్రాతినిథ్యం వహించినవారు ఈ ప్రాంత అభివృద్ధిని మాత్రం […]

Update: 2020-05-13 09:36 GMT

దిశ, కరీంనగర్: ‘మీరు ఓట్లేయకున్నా నేను మాత్రం మీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తా.. మీరు ఓట్లేసి గెలిపించినోళ్లు మాత్రం హైదరాబాద్ లో ఉంటూ అప్పుడప్పుడు వచ్చి ఫొటోలు దిగి పోతున్నారు’ అంటూ తన మనసులో ఉన్నది అతను చెప్పుకొచ్చాడు. భూపాలపల్లి జిల్లా పల్మెల మండలంలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 35 ఏళ్ల పాటు మంథని నుంచి ప్రాతినిథ్యం వహించినవారు ఈ ప్రాంత అభివృద్ధిని మాత్రం విస్మరించారని, మీ గురించి పట్టించుకోకున్నా మీరు ఓట్లేస్తారన్న నమ్మకంతోనే వారు సరిగా పనిచేయ లేదని, అంతేకాదు రేపో మాపో ముఖ్యమంత్రి అయితానని ప్రచారం చేసుకున్నారు కానీ, మారుమూల ప్రాంతాల అభ్యున్నతి గురించి ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మీరు గెలిపించినా, ఓడించినా మీ కష్టాలు తీర్చాలనే తపనతో ఉన్నానని మధు పేర్కొన్నారు. ఇప్పుడు జరుగుతున్న వంతెనల నిర్మాణాలన్నీ పూర్తి చేసిన తరువాత విద్యుత్ సరఫరా, నీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. రానున్న కాలంలో పల్మెల మండలం మీదుగా విశాఖపట్నం, భద్రాచలం ప్రాంతాలకు అనుసంధానం కానుందని… దీంతో రానున్న కాలంలో మండలానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జడ్పీ ఛైర్ పర్సన్ జక్కు హర్షిణి, మహదేవపూర్ ఎంపీపీ రాణీ బాయి, స్థానిక సర్పంచ్ జవ్వాజి పుష్పలత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి పాల్గొన్నారు.

Tags:    

Similar News