స్మితా సబర్వాల్‌ను కలిసిన పుట్ట మధు.. ఎందుకో తెలుసా..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: మంథని నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేయాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు.. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం అందించారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎంఓను కలిసిన ఆయన.. పలు ప్రతిపాదనలను అందజేశారు. పుట్ట మధు ప్రతిపాదనలు.. * రూ. 210 కోట్లతో పోతారం లిఫ్ట్ ఇరిగేషన్‌ను చేపట్టాలి.. ఈ లిఫ్ట్ ద్వారా మంథని, రామగిరి మండలాల్లోని 30 వేల ఎకరాలకు నీరు అందించవచ్చు. * మహదేవపూర్ మండలం […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: మంథని నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేయాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు.. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు వినతి పత్రం అందించారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎంఓను కలిసిన ఆయన.. పలు ప్రతిపాదనలను అందజేశారు.
పుట్ట మధు ప్రతిపాదనలు..
* రూ. 210 కోట్లతో పోతారం లిఫ్ట్ ఇరిగేషన్‌ను చేపట్టాలి.. ఈ లిఫ్ట్ ద్వారా మంథని, రామగిరి మండలాల్లోని 30 వేల ఎకరాలకు నీరు అందించవచ్చు.
* మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలో నిర్మాణంలో ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూడా త్వరగా పూర్తిచేసినట్టయితే.. మహాదేవపూర్, కాటారం, మల్హర్, మహముత్తారం మండలాల్లోని 45 వేల ఎకరాలకు నీరు అందించవచ్చు.
* రూ. 30 కోట్లతో దామరకుంట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడితే 2,200 ఎకరాలకు నీరందుతుంది. అలాగే రూ. 30 కోట్లతో విలాసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించి.. విలాసాగర్, గంగారాం గ్రామాల్లోని వెయ్యి ఎకరాలకు నీరు అందించవచ్చు.
* మల్హర్ మండలంలో రూ. 90 కోట్లతో మల్హర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించినట్టయితే మల్లారం, పెద్దతూండ్ల, దుబ్బగట్టు, దుబ్బపేట, కాపురం, తాడిచెర్ల గ్రామాల్లో 7 వేల ఎకరాలకు నీరు అందుతుంది.
* మంథని మండలం ఆరెందలో రూ. 120 కోట్లతో ఆరెంద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తే.. ఆరెంద, మల్లారం, భట్టుపల్లి, వెంకటాపూర్, నాగేపల్లి, ఆడివి సోమన్ పల్లి, స్వర్ణపల్లి గ్రామాల్లో 7,500 ఎకరాలకు నీరు అందించవచ్చు.
మంథని మండలంలోని పెద్ద ఓదాల వద్ద రూ. 10 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించినా.. 500 ఎకరాలకు నీరందించే అవకాశం ఉంటుందన్నారు పుట్ట మధు. అలాగే, చిన్న ఓదాల వద్ద రూ. 12 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించాలని స్మితా సబర్వాల్‌ను కోరారు. ఈ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసినట్టయితే నియోజకవర్గంలో సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్టు అవుతుందని పుట్ట మధు సీఎంఓకు వివరించారు.