బాధ తగ్గాలంటే.. ఇలా చేయండి!
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి మనిషి జీవితంలో.. బాధలు, కష్టాలు, కోపాలు, తాపాలు, ఒత్తిడి, సంతోషం అన్నీ ఓ ప్యాకేజ్‌లా ఉంటాయి. సంతోషంగా ఉంటే ఎవరికీ ఏ బాధ ఉండదు కానీ.. అన్ని వేళలా అందరికీ అది సాధ్యపడకపోవచ్చు. అప్పుడప్పుడు కష్టాలు చుట్టుముడతాయి. ఒత్తిడి చిత్తు చేస్తుంది, భరించలేని బాధ గుండెను మెలిపెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటిని ఫేస్ చేసి ముందుకు పోవాలే తప్ప అక్కడే ఆగిపోయి.. వాటి కోసం టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. టైమ్ ఈజ్ అల్వేజ్ […]
దిశ, వెబ్‌డెస్క్:
ప్రతి మనిషి జీవితంలో.. బాధలు, కష్టాలు, కోపాలు, తాపాలు, ఒత్తిడి, సంతోషం అన్నీ ఓ ప్యాకేజ్‌లా ఉంటాయి. సంతోషంగా ఉంటే ఎవరికీ ఏ బాధ ఉండదు కానీ.. అన్ని వేళలా అందరికీ అది సాధ్యపడకపోవచ్చు. అప్పుడప్పుడు కష్టాలు చుట్టుముడతాయి. ఒత్తిడి చిత్తు చేస్తుంది, భరించలేని బాధ గుండెను మెలిపెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాటిని ఫేస్ చేసి ముందుకు పోవాలే తప్ప అక్కడే ఆగిపోయి.. వాటి కోసం టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. టైమ్ ఈజ్ అల్వేజ్ ప్రీషియస్. ఈ చిన్న స్టోరీ కూడా అదే విషయాన్ని చెబుతోంది. ఒత్తిడి, బాధల నుంచి బయటపడేందుకు పరిష్కారాన్నీ చూపే ప్రయత్నం చేస్తోంది.
ఒకానొక ప్రొఫెసర్.. ఒక గ్లాసు నీళ్లతో క్లాసులోకి వచ్చాడు. రాగానే ఆ ‘గ్లాసును పైకెత్తి చూపించేసరికి.. స్టూడెంట్స్ అంతా రెగ్యులర్‌గా ఆలోచించే కోణంలోనే ‘సగం ఖాళీ, సగం ఫుల్’ అనే ప్రశ్న వేస్తారేమోనని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ప్రొఫెసర్ ఓ చిన్న నవ్వు నవ్వి.. ‘ఈ గ్లాసు వాటర్ ఎంత బరువుగా ఉంది’ అని అడిగాడు. స్టూడెంట్స్ నుంచి చాలా సమాధానాలు వచ్చాయి. కానీ దాని బరువెంతో ఇక్కడ అనవసరమని చెప్పి.. ‘ఈ గ్లాసు నీళ్లను ఓ నిమిషం పాటు పట్టుకుంటే ఏమవుతుంది?’ అని స్టూడెంట్స్‌ని అడిగాడు. ‘నథింగ్’ అని ఓ విద్యార్థి బదులిచ్చాడు.
‘అదే ఓ గంట పాటు పట్టుకుంటే’ అంటూ మరో ప్రశ్న వేశారు ప్రొఫెసర్.. ‘మీ భుజాలు నొప్పి పెడతాయి’ అని స్టూడెంట్ సమాధానం. ‘మీరు చెప్పింది కరెక్టే.. అదే ఓ రోజంతా పట్టుకుంటే ఎలా ఉంటుంది’ అని మళ్లీ మరో ప్రశ్న వాళ్ల ముందుంచాడు. ‘మీ భుజాలు విపరీతంగా నొప్పెడతాయి. మజిల్స్ ఒత్తిడికి గురవుతాయి. ఇంకా చేయి కూడా కాసేపు వరకు పనిచేయకుండా పెరలైజ్డ్ కావచ్చు’ అంటూ స్టూడెంట్స్ ఆన్సర్ ఇచ్చారు. ‘యూ ఆర్ రైట్.. మరి నా పెయిన్ దిగిపోవాలంటే.. నేనేం చేయాలి ఇప్పుడు?’ అంటూ మరో ప్రశ్న సంధించాడు ప్రొఫెసర్ ‘గ్లాస్‌ను కింద పెట్టండి’ అనే జవాబు వచ్చింది.
‘ఎగ్జాట్లీ.. అలానే.. ప్రతి సిట్యువేషన్‌లో ‘గ్లాసు నీళ్ల బరువు’ అంతే ఉంది. కానీ ఎంత ఎక్కువసేపు దాన్ని పట్టుకుంటే.. నాకు అంత ఎక్కువ పెయిన్ కలిగింది. అంతకంత బరువు పెరిగినట్లు అనిపించింది. సేమ్ ఇలానే.. మన జీవితంలో బాధలు, ఒత్తిడి ఉంటాయి. అవి గ్లాసు నీళ్ల బరువుతో సమానం. వాటిని కాసేపు భరిస్తే.. ఏమీ అన్పించదు. కానీ వాటి గురించి ఎంత ఎక్కువగా ఆలోచనలు చేస్తే.. అంత ఎక్కువగా బాధ కలుగుతుంది. అంతగా అవి హర్ట్ చేస్తాయి. ఇంకా ఇంకా ఆలోచిస్తే.. అవి ఒత్తిడికి దారి తీస్తాయి. అందుకే గ్లాసు నీళ్ల బరువును దించేసినట్లు వాటిని కూడా మనసులోంచి తీసేయాలి. ఎప్పటికీ ఒత్తిడిని, బాధలను క్యారీ చేయొద్దు. ఒక్క క్షణం బాధ.. ఒక రోజుని నాశనం చేయడం లేదా ఓ నిలువెత్తు మనిషిని ఒత్తిడిలోకి నెట్టేయడం కరెక్ట్ కాదు. వాటిని కూరల్లో కరివేపాకు తీసిపారేసినట్లు తీసి పక్కన పెట్టేసి ముందుకు వెళ్లండి.. ఆనందం మీ సొంతమవుతుంది’ అంటూ ప్రొఫెసర్ ముగించారు.