‘పుష్ప’ ట్విట్టర్ రివ్యూ… రేటింగ్‌లోనూ ‘తగ్గేదే లే’ అంటున్న బన్నీ..
దిశ, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చేసిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిందని చెప్తోంది ట్విట్టర్ రివ్యూ. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా ఊరమాస్ అవతార్‌లో బన్నీ రఫ్ఫాడించాడని అంటున్నారు విశ్లేషకులు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా కోసం రెండేళ్లు టైమ్ కేటాయించిన బన్నీకి.. రిజల్ట్ అద్భుతంగా వచ్చిందని, తన కెరియర్‌లో ది బెస్ట్ పిక్చర్‌గా నిలుస్తుందని చెప్తున్నారు. హీరోయిన్ రష్మిక మందన డీ గ్లామరస్ అవతార్ […]
దిశ, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చేసిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిందని చెప్తోంది ట్విట్టర్ రివ్యూ. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా ఊరమాస్ అవతార్‌లో బన్నీ రఫ్ఫాడించాడని అంటున్నారు విశ్లేషకులు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా కోసం రెండేళ్లు టైమ్ కేటాయించిన బన్నీకి.. రిజల్ట్ అద్భుతంగా వచ్చిందని, తన కెరియర్‌లో ది బెస్ట్ పిక్చర్‌గా నిలుస్తుందని చెప్తున్నారు. హీరోయిన్ రష్మిక మందన డీ గ్లామరస్ అవతార్ కూడా తనకు మంచి మార్కులు తీసుకొస్తుందంటున్న ట్విట్టర్ రివ్యూయర్స్… ఇక సమంత ఐటెమ్ సాంగ్ సినిమాను పీక్స్‌కు తీసుకెళ్తుందని చెప్తున్నారు.
ప్రియురాలితో ప్రియుడి రాసలీలలు.. సడన్ ఎంట్రీ ఇచ్చిన భర్త.. భయంతో ప్రియుడు ఏం చేశాడంటే?
USP of #Pushpa is #AlluArjun MINDBLOWING Performance, @iamRashmika Swag, Racy Story & Screenplay, Massy Action Stunts & @Samanthaprabhu2 HOT Item Song ! Go & Enjoy Winter Blockbuster. #PushpaTheRise
⭐⭐⭐⭐ pic.twitter.com/tEANRpD8de— Umair Sandhu (@UmairSandu) December 15, 2021
రేపు (డిసెంబర్ 17న) ఇండియాలో రిలీజ్ కావాల్సిన సినిమా రివ్యూ ఒక రోజు ముందుగానే అందుబాటులోకి వచ్చేసింది. దుబాయ్‌లో ఈ చిత్రం చూసిన రివ్యూయర్ ఉమైర్ సంధు సినిమాను ఆకాశానికి ఎత్తేస్తూ పోస్ట్ చేశాడు. ‘ పుష్ప యూఎస్‌పీ.. అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, రష్మిక స్వాగ్, రేసీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, మాసీ యాక్షన్ స్టంట్స్ మరియు సామ్ హాట్ ఐటెమ్ సాంగ్’ అని ట్వీట్ చేశాడు. ‘వింటర్ బ్లాక్ బస్టర్‌ను చూసి ఎంజాయ్ చేయండి’ అని సూచించిన ఉమైర్ సంధు.. ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అయితే ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూను తప్పు పట్టిన వాళ్లు కూడా లేకపోలేదు. ‘నీ రివ్యూ ఇప్పటి వరకు ఏదైనా కరెక్ట్ ఉందా? అనవసర విజ్ఞాన ప్రదర్శనలు చేయకు’ అని కామెంట్ చేస్తున్నారు.