గ్రామ పంచాయతీకి నిరసన సెగ.. హెచ్చరించిన ప్రజాప్రతినిధులు
దిశ, శామీర్ పేట్ : అలియాబాద్ గ్రామ పంచాయతీకి నిరసన సెగ తగిలింది. ప్రజా సమస్యలపై అధికారులకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు పోరాటానికి శ్రీకారం చుట్టారు. శామీర్ పేట్ మండల అలియాబాద్ గ్రామంలో శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరిస్తూ పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని, అధికారుల తీరుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, సర్పంచ్ ప్రవర్తన మార్చుకోకుంటే […]
దిశ, శామీర్ పేట్ : అలియాబాద్ గ్రామ పంచాయతీకి నిరసన సెగ తగిలింది. ప్రజా సమస్యలపై అధికారులకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు పోరాటానికి శ్రీకారం చుట్టారు. శామీర్ పేట్ మండల అలియాబాద్ గ్రామంలో శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరిస్తూ పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని, అధికారుల తీరుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, సర్పంచ్ ప్రవర్తన మార్చుకోకుంటే ప్రజా ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు. వీరికి ఎంపీటీసీలు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.