PTI నేతల దుశ్చర్య.. జర్నలిస్టును నగ్నంగా నిలబెట్టి, వీడియో తీసి..!

దిశ, వెబ్‌డెస్క్ : దాయాది పాకిస్తాన్‌లో ఓ జర్నలిస్టుకు ఘోర అవమానం జరిగింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన కొందరు నేతలు అతన్ని బంధించి చిత్రహింసలు పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం బాధిత జర్నలిస్టు ప్రెస్‌మీట్ ద్వారా వెల్లడించడమే కాకుండా, తనపై జరిగిన దాడిపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. వివరాల్లోకివెళితే.. జర్నలిస్టు సైఫుల్లా జన్ అనే వ్యక్తి గవర్నర్ బాడీ అయిన చార్‌సద్దా ప్రెస్‌క్లబ్ కమిటీ మెంబర్. ఇతన్ని పాకిస్తాన్ తెహ్రికే […]

Update: 2021-02-23 08:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దాయాది పాకిస్తాన్‌లో ఓ జర్నలిస్టుకు ఘోర అవమానం జరిగింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన కొందరు నేతలు అతన్ని బంధించి చిత్రహింసలు పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం బాధిత జర్నలిస్టు ప్రెస్‌మీట్ ద్వారా వెల్లడించడమే కాకుండా, తనపై జరిగిన దాడిపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. వివరాల్లోకివెళితే.. జర్నలిస్టు సైఫుల్లా జన్ అనే వ్యక్తి గవర్నర్ బాడీ అయిన చార్‌సద్దా ప్రెస్‌క్లబ్ కమిటీ మెంబర్. ఇతన్ని పాకిస్తాన్ తెహ్రికే ఇన్‌సాఫ్(PTI)కు చెందిన కొందరు నేతలు అబ్దుల్లా, అతని సోదరుడు ఫహీమ్, జాకత్ కమిటీ చైర్మన్ ఇఫ్తీకార్‌తో పాటు ఆయుధాలు కలిగిన మరో వ్యక్తి జర్నలిస్టు సైఫుల్లాను బలవంతంగా బంధించారు.

ఆ తర్వాత పీటీఐ ఆఫీసుకు తరలించి నగ్నంగా మార్చడమే కాకుండా చిత్రహింసలకు గురిచేశారు. ఆపై వీడియో తీశారు. సైఫుల్లాను విడుదల చేయాలని ప్రజల నుంచి ఆందోళనలు కొనసాగడంతో అతన్ని వదిలేశారు. అయితే, తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశాడు. దాడిలో తన కాలు ఫ్యా్క్చర్ అయిందని ఫిర్యాదులో పేర్కొంటే.. పోలీసులు చిన్నచిన్న గాయాలు మాత్రమే అయ్యాయని FIR నమోదు చేసినట్లు ఆరోపించాడు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సైఫుల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు.

 

Tags:    

Similar News