హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ ఆందోళన.. కారణమిదే..!
దిశ, హుజురాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు ఆర్డీవో కార్యాలయం ముందు ఆ పార్టీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణాలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. వడ్ల కొనుగోలులో పంజాబ్ కు ఒక న్యాయం.. తెలంగాణకు […]
దిశ, హుజురాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు ఆర్డీవో కార్యాలయం ముందు ఆ పార్టీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణాలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. వడ్ల కొనుగోలులో పంజాబ్ కు ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతాంగ సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పార్టీలకతీతంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.