చిక్కుల్లో హీరో, నిర్మాత.. భోపాల్‌లో నిరసనలు
దిశ, సినిమా : కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘సత్యనారాయణ కీ కథ’ సినిమా చిక్కుల్లో పడింది. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ.. సంస్కృతి బచావ్ మంచ్ ఆధ్వర్యంలో భోపాల్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నిర్మాతపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు అధ్యక్షులు చంద్రశేఖర్ తివారీ. సాజిద్‌ను ముఖానికి నలుపురంగు పూసి గాడిదపై ఊరేగిస్తామని హెచ్చరించారు. దీనిపై టీటీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్న ఆయన.. ఎఫ్‌ఐఆర్ […]
దిశ, సినిమా : కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘సత్యనారాయణ కీ కథ’ సినిమా చిక్కుల్లో పడింది. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందంటూ.. సంస్కృతి బచావ్ మంచ్ ఆధ్వర్యంలో భోపాల్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. నిర్మాతపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు అధ్యక్షులు చంద్రశేఖర్ తివారీ. సాజిద్‌ను ముఖానికి నలుపురంగు పూసి గాడిదపై ఊరేగిస్తామని హెచ్చరించారు. దీనిపై టీటీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్న ఆయన.. ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. హిందువులను కించపరుస్తూ సినిమాలు తీయడం బాలీవుడ్‌కు అలవాటైపోయిందని ఫైర్ అయ్యారు. కాగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉంటుందని ప్రకటించారు మేకర్స్.