హ్యాకర్స్ నుంచి ఎలా రక్షించుకోవాలి?
దిశ, వెబ్‌డెస్క్: ఇంటి ఫ్రంట్ డోర్‌కు లాక్ వేయకుండా అలాగే వదిలేసి భద్రంగా ఉండగలమా? లేదు కదా.. అలానే మన డిజిటిల్ లైఫ్‌లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే హ్యాకర్స్ చేతికి చిక్కుతుంటాం. మనకు తెలియకుండానే వాళ్ల చేతిలో మన డేటా అంతా పెట్టేస్తాం. దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లన్నమాట. ఫ్రీ వైఫై కూడా అలాంటిదే. డిజిటల్ సెక్యూరిటీ అనేది మన మొబైల్‌కు చాలా అవసరం. ఎనేబుల్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇంటి ఫ్రంట్ డోర్‌కు లాక్ వేయకుండా అలాగే వదిలేసి భద్రంగా ఉండగలమా? లేదు కదా.. అలానే మన డిజిటిల్ లైఫ్‌లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే హ్యాకర్స్ చేతికి చిక్కుతుంటాం. మనకు తెలియకుండానే వాళ్ల చేతిలో మన డేటా అంతా పెట్టేస్తాం. దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లన్నమాట. ఫ్రీ వైఫై కూడా అలాంటిదే. డిజిటల్ సెక్యూరిటీ అనేది మన మొబైల్‌కు చాలా అవసరం.
ఎనేబుల్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే.. కామన్‌గా మనం ప్రతి దానికి ఓ పాస్‌వర్డ్ పెట్టుకుంటాం. అది కాకుండా మరో ‘సెకండ్ ఫ్యాక్టర్’ ఎంటర్ చేస్తేనే ఆ యాప్ కానీ, సైట్ కానీ ఓపెన్ అవుతుంది. ఉదాహరణకు జీమెయిల్‌కు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకుంటే.. పాస్‌వర్డ్ ఎంటర్ చేశాక ‘జీ కోడ్’ అడుగుతుంది. ఆ కోడ్ మన మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయగానే జీ మెయిల్ ఓపెన్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇది ఓటీపీ టైప్ అన్నమాట. ఇండియాలో ఫేస్‌బుక్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, వీటితో పాటు ఎన్నో మేజర్ సర్వీస్‌లు ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. వీటిని ఎనేబుల్ చేసుకోవడం వల్ల హ్యాకర్స్ చేతికి చిక్కకుండా జాగ్రత్త పడొచ్చు.
యూజ్ ఏ పాస్‌వర్డ్ మేనేజర్
ప్రతి యాప్‌కు సెక్యూర్ పాస్‌వర్డ్ తప్పనిసరిగా ఉండాలని మనందరికీ తెలుసు. అలాగే పాస్‌వర్డ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. కుటుంబ సభ్యుల పేర్లో, బైక్ నెంబర్లో, పెట్ నేమ్స్, స్పెషల్ డేట్స్ (బర్త్ డే, మ్యారేజ్ డే), లక్కీ నెంబర్స్, సిరీస్ అండ్ ఫ్యాన్సీ నెంబర్స్, సిరీస్ అల్ఫాబెట్స్ వంటివి పెట్టుకోకూడదు. ‘స్ట్రాంగ్ అండ్ యునిక్ ’ పాస్‌వర్డ్స్ కోసం పాస్‌వర్డ్ మేనేజర్ యాప్స్‌ను ఉపయోగించాలి. ఇందుకోసం గూగుల్ స్టోర్‌లోని పాస్‌వర్డ్ మేనేజర్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
డు నాట్ యూజ్ ఫ్రీ వైఫై
మహా నగరాలు, పెద్ద పెద్ద పట్టణాల్లోని పబ్లిక్ ప్లేసుల్లో చాలా వరకు ఫ్రీ వైఫై హబ్స్ ఉన్నాయి. ఉచితంగా వస్తుంది కదా అని చాలా మంది ఫ్రీ వైఫై యూజ్ చేసేందుకు మొగ్గు చూపుతారు. కానీ హ్యాకర్స్ ఉపయోగించుకునే తొలి ఆయుధం వైఫై హాట్ స్పాట్‌లే. మనం వైఫైకి కనెక్ట్ కాగానే.. కంప్యూటర్, ఫోన్, లాప్‌టాప్ ఇలా దేన్నయినా హ్యాకర్స్ ఈజీగా ట్రాక్ చేస్తారు. మాల్‌వేర్, ర్యాన్సమ్ వేర్స్‌ను వాటిల్లోకి పంపించి అటాక్ చేస్తారు. అందుకే వైఫై సిగ్నల్ క్రెడిబుల్ సోర్స్ నుంచి వస్తే వాడుకోవాలి కానీ.. ఇలాంటి ఫ్రీ వైఫైలు అస్సలు వాడకపోవడమే మంచిది.
ఎనేబుల్ ఏ గెస్ట్ వైఫై
మన స్నేహితుడో, పక్కింటి వాళ్లో లేదా బంధువులో అప్పుడప్పుడు మన వైఫై పాస్‌వర్డ్ అడుగుతుంటారు. మనం కూడా కాదనుకుంటా చెప్పేస్తుంటాం. ఇలా చేయడం వల్ల ఎంతమంది మన వైఫై వాడుతున్నారో లేదా వాడారో అన్నది గుర్తించలేకపోతాం. అయితే ప్రస్తుతం కొత్తగా వస్తున్న వైఫై రూటర్లలో ‘గెస్ట్ వైఫై’ అనే ఆప్షన్ ఉంది. దీని వల్ల ఆ లిస్టులో ఉన్న వారికి సెపరేట్‌గా వైఫై సిగ్నల్ అందుతుంది. సో మెయిన్ వైఫైని ఎనేబుల్ చేసుకుని, గెస్ట్ వైఫైని డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. ఇది వైఫై వాడే వాళ్లకు ఉపయోగకరమే కాక సురక్షితం కూడా.
కన్సిడర్ ఏ వీపీఎన్
ఆఫీసు పని చేయడానికి లేదా పర్సనల్ పనులు చేసుకోవడానికి కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్.. ఇలా ఏదైనా డివైజ్‌లో ఇంటర్నెట్ వాడుతుంటాం. ఇందుకోసం నెట్‌వర్క్ ఆపరేటర్స్ ఆ డివైజ్ యూజర్‌కు ఒక నెంబర్ ఇస్తారు. దానినే ఐపీ నెంబర్(ఇంటర్నెట్ ప్రొటోకాల్ నెంబర్) అంటారు. నెట్ వాడే సమయంలో ఆ ఐపీ నెంబర్‌తోనే డివైజ్ కనెక్ట్ అవుతుంది. అలాంటి టైమ్‌లో ‘ఏ డివైజ్‌లో ఇంటర్నెట్ వాడుతున్నారు ? ఏ వెబ్‌సైట్ చూస్తున్నారు? లొకేషన్..’ ఇలాంటి ట్రాక్ వివరాలన్నీ వేరే వాళ్లు తెలుసుకునే ఆస్కారం ఉంది. హ్యాకర్లు కూడా ఇలానే చూస్తారు. అందువల్ల ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేయడానికి వీల్లేకుండా, బ్రౌజింగ్ సురక్షితంగా చేసుకునేందుకు వీపీఎన్ వాడాలి. ఇందుకోసం సర్వీస్ ప్రొవైడర్స్ ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇవి ఐపీని హైడ్ చేసి ఇంటర్నెట్ రిక్వెస్ట్‌ను ప్రాసెస్ చేస్తాయి. అప్పుడు బ్రౌజింగ్‌లో ఉన్న యూజర్ ఐపీ అడ్రస్ ఎవరికీ తెలియదు. సెపరేట్ ఐపీ అడ్రస్‌తో ఇంటర్నెట్ బ్రౌజింగ్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో యూజర్ డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్ అవుతుంది (ప్రైవేట్ బ్రౌజింగ్‌లో ఎన్‌క్రిప్ట్ కాదు). అంటే.. ఈ సర్వీస్‌లో డేటా హ్యాకర్లు, ఇతరుల చేతికి చిక్కకుండా డేటా సేఫ్‌గా ఉంటుందన్నమాట.