TSNPDCLలో సబ్ ఇంజనీర్లకు ఏఈలుగా పదోన్నతులు
దిశ, ఖమ్మం : టీఎస్ఎన్‌పీడీసీఎల్(TSNPDCL) ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ విభాగాల్లో సబ్ ఇంజనీర్లుగా పని చేస్తున్న 7 మందికి ఏఈలుగా పదోన్నతులు కల్పిస్తూ గురువారం టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం సబ్-ఇంజనీర్‌గా పనిచేస్తున్న జీ. రాజ్‌కుమార్ ను ఖమ్మం ఏఈ హెచ్‌టీ మీటర్స్, ఖమ్మం అర్బన్ సబ్-ఇంజనీర్‌గా పనిచేస్తున్న బీ. రవికుమార్ ను ఏఈ తిరుమలాయపాలెం, చింతకాని సబ్-ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆర్. ప్రసాద్ ను ఖమ్మం […]
దిశ, ఖమ్మం : టీఎస్ఎన్‌పీడీసీఎల్(TSNPDCL) ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ విభాగాల్లో సబ్ ఇంజనీర్లుగా పని చేస్తున్న 7 మందికి ఏఈలుగా పదోన్నతులు కల్పిస్తూ గురువారం టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం సబ్-ఇంజనీర్‌గా పనిచేస్తున్న జీ. రాజ్‌కుమార్ ను ఖమ్మం ఏఈ హెచ్‌టీ మీటర్స్, ఖమ్మం అర్బన్ సబ్-ఇంజనీర్‌గా పనిచేస్తున్న బీ. రవికుమార్ ను ఏఈ తిరుమలాయపాలెం, చింతకాని సబ్-ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆర్. ప్రసాద్ ను ఖమ్మం ఏఈ కన్ట్సక్షన్, ఖమ్మం రూరల్ ఎదులావురం సబ్-ఇంజనీర్‌గా పనిచేస్తున్న తౌర్య ఖమ్మం టౌన్-3 ఏఈగా, ఖమ్మం రూరల్ సబ్‌డివిజన్ కార్యాలయంలో సబ్-ఇంజనీర్‌గా పనిచేస్తున్న మౌనిక ఖమ్మం టౌన్-1 ఏఈగా పదోన్నతులు ఇచ్చారు. దాంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నార్త్ సబ్-ఇంజనీర్‌గా పనిచేస్తున్న జీ. నరసింహారావు ను ఏఈ చుంచుపల్లి, బూర్గంపాడు సబ్-ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న క్రాంతి సింహ ను ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ ఎదులాపురం ఏఈగా పదోన్నతులు కల్పించారు.