అమెజాన్‌తో ప్రియాంక భారీ డీల్!
యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. అమెజాన్ స్టూడియోస్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్లకు సంబంధించిన ఈ డీల్ విలువ మల్టీ మిలియన్ డాలర్లు కాగా.. ఈ డీల్‌తోనే టెలివిజన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. 20 ఏళ్ల కెరియర్లో 60 సినిమాలు చేసిన ప్రియాంక.. తను అనుకున్నది సాధించే మార్గంలో ఉన్నట్లు తెలిపింది. అమెజాన్‌తో ఒప్పందంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. జెన్నిఫర్ సల్కే బెస్ట్ పార్టనర్ అని తెలిపారు. టాలెంట్, మంచి కంటెంట్‌కు హద్దులు ఉండవని నమ్మారని అన్నారు. […]
యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. అమెజాన్ స్టూడియోస్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్లకు సంబంధించిన ఈ డీల్ విలువ మల్టీ మిలియన్ డాలర్లు కాగా.. ఈ డీల్‌తోనే టెలివిజన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. 20 ఏళ్ల కెరియర్లో 60 సినిమాలు చేసిన ప్రియాంక.. తను అనుకున్నది సాధించే మార్గంలో ఉన్నట్లు తెలిపింది. అమెజాన్‌తో ఒప్పందంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. జెన్నిఫర్ సల్కే బెస్ట్ పార్టనర్ అని తెలిపారు. టాలెంట్, మంచి కంటెంట్‌కు హద్దులు ఉండవని నమ్మారని అన్నారు.
https://www.instagram.com/p/CCE4V1vjrSi/?igshid=qae40gkxbp0i
యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా భాష, ప్రాంతీయ భేదం లేకుండా క్రియేటివిటీ అనేది ఒక దగ్గర చేరాలని కోరుకుంటానని.. అలా గొప్ప కంటెంట్ బయటకొస్తుందని తెలిపింది ప్రియాంక. ఇదే తన నిర్మాణ సంస్థ పర్పుల్ పెబుల్ పిక్చర్స్ ప్రధాన లక్ష్యం అని చెప్పింది. ‘ఒక స్టోరీ టెల్లర్గా కొత్త కొత్త ఆలోచనలు బయటకు రావాలని కోరుకుంటాను.. కేవలం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాదు.. ఒక్కో కోణంలో ఒక్కో ఆలోచనా విధానం చూపించాలి అనుకుంటున్నట్లు’ చెప్పింది. 20 ఏళ్ల ప్రయాణం తర్వాత దానికి చేరువలో ఉన్నట్లు తెలిపింది.
ప్రపంచమంతా ఆనందించే కంటెంట్‌తో ప్రియాంకతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు అమెజాన్ స్టూడియోస్ అధినేత జెన్నిఫర్ సాల్కే. వైవిధ్యమైన అంశాలు ప్రజెంట్ చేయడంలో ప్రియాంక, తను ఒకేలా ఆలోచిస్తామని చెప్పారు.