ప్రతి ఒక్కరిలోనూ రాముడున్నాడు : ప్రియాంక గాంధీ
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరం నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు మౌనం వీడింది. ఆలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని పలువురి నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తొలిసారి స్పందించారు. అయోధ్యలో రామాలయం భూమి పూజకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ విషయంపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా రియాక్ట్ అయ్యారు. రామాలయ భూమిపూజ జాతి ఐక్యమత్యం, సంస్కృతి, సామాజిక భావానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. నిరాడంబరం, ధైర్యం, సహనం, త్యాగం, […]
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరం నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు మౌనం వీడింది. ఆలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని పలువురి నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తొలిసారి స్పందించారు. అయోధ్యలో రామాలయం భూమి పూజకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఈ విషయంపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా రియాక్ట్ అయ్యారు.
రామాలయ భూమిపూజ జాతి ఐక్యమత్యం, సంస్కృతి, సామాజిక భావానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. నిరాడంబరం, ధైర్యం, సహనం, త్యాగం, పట్టుదలకు మారు రూపమైన దీన బంధు రాముడని, ప్రతీ ఒక్కరిలోనూ రాముడున్నాడని, రాముడు అందరివాడని ప్రియాంక రాసుకొచ్చారు. సీతారాముల సందేశం, దీవెనలకు ప్రతిరూపంగా జరిగే భూమిపూజ జాతిఐక్యతా చిహ్నంగా ఉండబోతోందని ప్రియాంక ట్వీట్ చేశారు.