అర్జున్ యుద్ధ ట్యాంక్ ఆర్మీకి అప్పగింత

దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఆదివారం స్వదేశీ యుద్ధ ట్యాంక్ ఎంబీటీ (మెయిన్ బ్యాటిల్ ట్యాంక్) ఎంకే-1ఎను ఇండియన్ ఆర్మీకి ప్రధాని మోదీ అప్పగించారు. అర్జున్ యుద్ధ ట్యాంక్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ సరవణె స్వీకరించారు. ఈ అర్జున్ ఎంకే-1ఎ యుద్ధ ట్యాంక్‌ను ఆవడిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఆదివారం ఉదయం 10.35 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో తమిళనాడులోని చెన్నైకి చేరుకున్నారు. అక్కడి నుంచి […]

Update: 2021-02-14 02:11 GMT

దిశ,వెబ్‌డెస్క్: తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఆదివారం స్వదేశీ యుద్ధ ట్యాంక్ ఎంబీటీ (మెయిన్ బ్యాటిల్ ట్యాంక్) ఎంకే-1ఎను ఇండియన్ ఆర్మీకి ప్రధాని మోదీ అప్పగించారు. అర్జున్ యుద్ధ ట్యాంక్‌ను ఆర్మీ చీఫ్ జనరల్ సరవణె స్వీకరించారు. ఈ అర్జున్ ఎంకే-1ఎ యుద్ధ ట్యాంక్‌ను ఆవడిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు.

ఆదివారం ఉదయం 10.35 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో తమిళనాడులోని చెన్నైకి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియానిక వెళ్లారు. ప్రధాని మోదీకి సీఎం పళనిస్వామి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్ర‌ధాని మోదీ ఆర్జున్ యుద్ధ ట్యాంకును ఆర్మీ జనరల్‌కు అందజేశారు.

Tags:    

Similar News