మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై స్పందించిన ప్రధాని మోడీ
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. జ్వరం, అలసట కారణంగా ఆయన బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌లో చేరారు. ఆయనకు ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలో వైద్య బృందం ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దీంతో మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ట్వి్ట్టర్ వేదికగా కోరుతున్నారు. తాజాగా.. మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘‘మన్మోహన్ సింగ్ త్వరగా […]
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. జ్వరం, అలసట కారణంగా ఆయన బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌లో చేరారు. ఆయనకు ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా నేతృత్వంలో వైద్య బృందం ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నారు. దీంతో మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ట్వి్ట్టర్ వేదికగా కోరుతున్నారు. తాజాగా.. మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘‘మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని.. ఆయన ఆరోగ్యవంతంగా జీవించాలనీ ప్రార్థిస్తున్నాను.” అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
అంతేగాకుండా.. మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిను గురించి తెలుసుకోవడానికి గురువారం ఉదయం హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయా ఢిల్లీలోని ఎయిమ్స్ సందర్శించారు. మాజీ ప్రధాని ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాండవీయా మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ కొన్ని అనారోగ్య ఇబ్బందులతో ఆసుపత్రికి వచ్చారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
I pray for the good health and speedy recovery of Dr. Manmohan Singh Ji.
— Narendra Modi (@narendramodi) October 14, 2021