యోగి ప్రభుత్వంపై మోదీ ప్రశంసలు
లక్నో: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నియంత్రణలో అద్భుతంగా వ్యవహరించిందని, మహమ్మారిని విజయవంతంగా నిలువరించిందని యోగి ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. వైరస్ వ్యాప్తి వేగాన్ని గణనీయంగా తగ్గించిందని వివరించారు. కాశీలో మౌలికవసతులు పలురెట్లు అభివృద్ధి చెందాయని, సంక్షోభ సమయంలోనూ విరమించేది లేదని కాశీ చాటిచెప్పిందని సొంత నియోజకవర్గాన్ని కొనియాడారు. గత కొన్ని నెలలు ప్రపంచ మానవాళికి సవాల్ విసిరితే, కాశీ సహా ఉత్తరప్రదేశ్ ధీటుగా వైరస్‌ను ఎదుర్కొని నిలదొక్కుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో […]
లక్నో: కరోనా వైరస్ సెకండ్ వేవ్ నియంత్రణలో అద్భుతంగా వ్యవహరించిందని, మహమ్మారిని విజయవంతంగా నిలువరించిందని యోగి ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. వైరస్ వ్యాప్తి వేగాన్ని గణనీయంగా తగ్గించిందని వివరించారు. కాశీలో మౌలికవసతులు పలురెట్లు అభివృద్ధి చెందాయని, సంక్షోభ సమయంలోనూ విరమించేది లేదని కాశీ చాటిచెప్పిందని సొంత నియోజకవర్గాన్ని కొనియాడారు. గత కొన్ని నెలలు ప్రపంచ మానవాళికి సవాల్ విసిరితే, కాశీ సహా ఉత్తరప్రదేశ్ ధీటుగా వైరస్‌ను ఎదుర్కొని నిలదొక్కుకున్నాయని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం యూపీనే అని, అత్యధికంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న రాష్ట్రమూ ఇదేనని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఉదయం సొంత నియోజకవర్గం వారణాసికి వెళ్లారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌లు స్వాగతించారు. అనంతరం ఆయన అక్కడ రూ. 1,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనచేశారు. బెనారస్ హిందు యూనివర్సిటీకి చెందిన 100 పడకల ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. గంగా నదిలో టూరిజం ప్రాజెక్టులను, వారణాసి- ఘాజీపూర్ హైవేపైనున్న మూడుదారుల ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. కాశీలో నిర్మించిన ఇంటర్నేషనల్ కోఆపరేషన్, కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్ష్‌ను ప్రారంభించి శివలింగ ఆకారంలోని ఆ నిర్మాణాకృతిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.