మోడీ వాడే పెన్ను ఖరీదు 1.3 లక్షలు!
దిశ, వెబ్ డెస్క్: కొందరు వ్యక్తులు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వారి మూలాలను మరిచిపోరు. వారి ప్రయాణం అభివృద్ధి మనుగడలో కొనసాగుతున్నా కూడా జీవన ప్రక్రియలో ఎక్కడో ఒక చోట వారి అభిరుచులు, సందేశాత్మకమైన సూచనలు వంటి అంశాలు వారి అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. వాటిని గమనించిన ప్రతి ఒక్కరూ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమంటే ఇదేనేమో అన్న మాటలను గుర్తుకుతెచ్చుకుంటారు. ఎందుకంటే వారు అనుసరిస్తున్న విధానాల్లో సందేశం దాగి ఉంటది. ఈ మాటలు […]
దిశ, వెబ్ డెస్క్: కొందరు వ్యక్తులు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వారి మూలాలను మరిచిపోరు. వారి ప్రయాణం అభివృద్ధి మనుగడలో కొనసాగుతున్నా కూడా జీవన ప్రక్రియలో ఎక్కడో ఒక చోట వారి అభిరుచులు, సందేశాత్మకమైన సూచనలు వంటి అంశాలు వారి అలవాట్లలో స్పష్టంగా కనిపిస్తుంటాయి. వాటిని గమనించిన ప్రతి ఒక్కరూ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమంటే ఇదేనేమో అన్న మాటలను గుర్తుకుతెచ్చుకుంటారు. ఎందుకంటే వారు అనుసరిస్తున్న విధానాల్లో సందేశం దాగి ఉంటది.
ఈ మాటలు ఎందుకు ప్రస్తావనకు వచ్చిందంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరలవుతోంది. అందులో ప్రముఖులు వాడిన పెన్నుల ఖరీదు విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ప్రముఖలను పొగిడే దిశగా పోస్టులు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అమీర్ ఖాన్ అనే యువకుడు ట్విట్టర్ లోని తన అకౌంట్లో ఓ ఫొటోను అప్ లోడ్ చేశాడు. ప్రస్తుత ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఫొటోలు అందులో ఉన్నాయి. వారు వాడుతున్న పెన్నులు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పెన్నులు ఏ కంపెనీకి చెందినవి, వాటి ఖరీదుల వంటి వివరాలను అందులో స్పష్టంగా పేర్కొన్నాడు. అంటే దీన్ని బట్టీ చూస్తే.. పెన్నుల ఖరీదులను బట్టి ఎవరు సందేశాత్మకమో మనం తెలుసుకోవొచ్చు అన్న మాటను అతను పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
మన్మోహన్ సింగ్, కేజ్రీవాల్ వాడే పెన్నుల ఖరీదు కేవలం రూ. 10, అదే ప్రధాని మోడీ వాడే పెన్ను ఖరీదు రూ. 1.3 లక్షలు అని ఆ ఫొటోలో ఆ వ్యక్తి పేర్కొన్నాడు.