ఆసక్తికరంగా మోదీ ట్వీట్.. అది కూడా తెలుగులో

దిశ, వెబ్‌డెస్క్: తెలుగువారందరికీ అతి ముఖ్యమైన పండుగ ఉగాది. తెలుగువారికి కొత్తసంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచే. ఉగాది పచ్చడితో కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతారు. కొత్త సంవత్సరంలో ఇదే తొలి పండుగ కావడంతో తెలుగువారందరూ ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. ఇవాళ ఉగాది సందర్భంగా.. ప్రజలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగువారికి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. అది కూడా తెలుగులో ట్వీట్ చేయడం […]

Update: 2021-04-12 23:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగువారందరికీ అతి ముఖ్యమైన పండుగ ఉగాది. తెలుగువారికి కొత్తసంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచే. ఉగాది పచ్చడితో కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెబుతారు. కొత్త సంవత్సరంలో ఇదే తొలి పండుగ కావడంతో తెలుగువారందరూ ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు.

ఇవాళ ఉగాది సందర్భంగా.. ప్రజలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగువారికి విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. అది కూడా తెలుగులో ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరందరూ ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి లేదా ఏదైనా పర్యటనకు వచ్చిన సమయంలో మోదీ తెలుగులో మాట్లాడి అందరికీ ఆకట్టుకుంటూ ఉంటారు. గతంలో చాలాసార్లు మోదీ తెలుగులో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News