గర్భిణులు టీకా తీసుకోవచ్చు: కేంద్రం

న్యూఢిల్లీ: ఇక నుంచి గర్భిణులూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. వ్యాధి నిరోధంపై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) సిఫారసుల మేరకు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే గర్భిణులు కొవిన్ పోర్టల్‌‌లో లేదా దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి స్పాట్‌లోనే రిజిస్టర్ చేసుకుని టీకా పొందవచ్చని తెలిపింది. గర్భిణులకు టీకా వేయడానికి కార్యాచరణ మార్గదర్శకాలు, మెడికల్ ఆఫీసర్లకు కౌన్సెలింగ్ కిట్‌ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు […]

Update: 2021-07-02 09:37 GMT

న్యూఢిల్లీ: ఇక నుంచి గర్భిణులూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. వ్యాధి నిరోధంపై జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) సిఫారసుల మేరకు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే గర్భిణులు కొవిన్ పోర్టల్‌‌లో లేదా దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి స్పాట్‌లోనే రిజిస్టర్ చేసుకుని టీకా పొందవచ్చని తెలిపింది. గర్భిణులకు టీకా వేయడానికి కార్యాచరణ మార్గదర్శకాలు, మెడికల్ ఆఫీసర్లకు కౌన్సెలింగ్ కిట్‌ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపామని వెల్లడించింది. గర్భిణులందరూ తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఇది వారికి సురక్షితమేనని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. గర్భిణులకు వ్యాక్సిన్ వేసే ముందే అర్హులైన వైద్య సిబ్బంది వారికి టీకా గురించి, దాని లాభాలు, ప్రతికూలతలపై పూర్తి సమాచారం ఇవ్వాలని కేంద్రం వెల్లడించింది. కాగా, బాలింతలకు గత నెలలోనే వ్యాక్సిన్ తీసుకునేందుకు కేంద్రం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News