సీనియారిటీ ప్రకారం ప్రాధాన్యత ఇవ్వాలి.. కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి సూచనలు
దిశ, సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో లోకల్ క్యాడర్ కేటాయింపు ప్రక్రియ సజావుగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావుతో కలసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయి లోకల్ క్యాడర్ పోస్టులపై అధికారులు స్పష్టతగా వివరాలు అందించాలని సూచించారు. ముఖ్యంగా ఇతర జిల్లాల నుండి వచ్చిన సిబ్బందికి […]
దిశ, సూర్యాపేట కలెక్టరేట్: జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో లోకల్ క్యాడర్ కేటాయింపు ప్రక్రియ సజావుగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావుతో కలసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయి లోకల్ క్యాడర్ పోస్టులపై అధికారులు స్పష్టతగా వివరాలు అందించాలని సూచించారు. ముఖ్యంగా ఇతర జిల్లాల నుండి వచ్చిన సిబ్బందికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఖాళీలు చూపించి సీనియారిటీ ప్రకారం ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అన్ని శాఖల అధికారులతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు.
స్పెషల్ కేసులు, వితంతుల సమస్యలు ఏమైనా ఉంటే సమాచారాన్ని స్వీకరించి అభ్యంతరాలు అందించాలని అన్నారు. జిల్లాకు కేటాయించబడిన ఉద్యోగస్తులకు ప్రాధాన్యత క్రమంలో పోస్టింగ్ లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ రాజేందర్ కుమార్ ఏ. ఓ శ్రీదేవి పర్యవేక్షకులు పులి సైదులు, సుదర్శన్ రెడ్డి వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు ఉద్యోగ సంఘ ప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.